News May 11, 2024

చీరాల ఎన్నికల ప్రచారంలో సినీ నటుడు

image

ఓటు శక్తివంతమైన ఆయుధమని, ఓటు ద్వారా మన తలరాతను మార్చవచ్చని హీరో నిఖిల్ సిద్ధార్థ్ అన్నారు. చీరాల మండలం జాండ్రపేట హైస్కూల్ వద్ద నుంచి గడియార స్తంభం వరకు తెలుగు ప్రొఫెషనల్ వింగ్ ఆధ్వర్యంలో 2కే రన్ శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గరటయ్య, చీరాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొండయ్య తనయుడు గౌరీ అమర్నాథ్ తో కలిసి హీరో నిఖిల్ పాల్గొంటున్నారు.

Similar News

News November 19, 2025

జేసీకి ఫిర్యాదు.. చక్కదిద్దే ప్రయత్నాల్లో అధికారులు!

image

ప్రకాశం జేసీకి ఫిర్యాదు చేస్తే చాలు, అలా పరిష్కారం కావాల్సిందే అంటున్నారు దివ్యాంగులు. సోమవారం నిర్వహించిన కలెక్టర్ మీకోసం కార్యక్రమానికి దివ్యాంగులు తమ సమస్యను మొరపెట్టుకున్నారు. ప్రభుత్వం అందించే త్రీ వీలర్ బైక్ పొందేందుకు, ఎల్ఎల్ఆర్ లైసెన్స్ అవసరం. దీనికై రవాణా శాఖ కార్యాలయం వద్ద కొందరు లాబీయింగ్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు జేసీ వద్ద వాపోయారు. ఆయన ఆదేశాలతో లాబీయింగ్‌కు చెక్ పడిందట.

News November 19, 2025

రాష్ట్రస్థాయి పోటీలకు కొత్తఏరువారిపల్లి విద్యార్థిని ఎంపిక

image

సింగరాయకొండ మండలం పాకాలలో జరిగిన అండర్- 14 ఖోఖో రాష్ట్రస్థాయి ఎంపిక పోటీల్లో కనిగిరి మండలం కొత్త ఏరువారిపల్లి హైస్కూల్ విద్యార్థిని హర్షవర్ధని సత్తా చాటి ప్రకాశం జిల్లా తరఫున రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు PET అహ్మద్ చెప్పారు. హర్షవర్ధనికి ఉపాధ్యాయులు, సర్పంచ్ వెంకటయ్య, గ్రామస్థులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ఉన్నత ప్రతిభ కనబరచాలని వారు కోరారు.

News November 19, 2025

పెద్దారవీడు వద్ద ఎద్దుల అరకలను ఢీకొని దోర్నాల వ్యక్తి మృతి

image

పెద్దారవీడు మండలం బద్వీడు చెర్లోపల్లి సమీపంలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై వెళ్తున్న ఎద్దుల అరకలను ద్విచక్రవాహనం ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై ఉన్న ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. వారిని మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడు దోర్నాల మండలం యడవల్లికి చెందిన నల్లబోతుల శివగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.