News July 7, 2024
చీరాల: కానిస్టేబుల్ సస్పెండ్
చీరాలలో టీడీపీ నాయకుడిపై దాడి చేసిన ఘటనలో నేరుగా పాల్గొన్న కానిస్టేబుల్ మువ్వా బాలశంకర రావు(ఉరఫ్ బాలు) సస్పెండ్ అయ్యారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. టీడీపీ నాయకుడిపై కానిస్టేబుల్ దాడి చేశాడు. దీంతో బాధితుడు చీరాల రెండో పట్టణ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు నమోదైంది. దీనిపై విచారించిన ఎస్పీ వకుల్ జిందాల్ కానిస్టేబుల్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News November 28, 2024
రేపు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం రేపు ఉదయానికి తుఫానుగా బలపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శనివారం ఉదయం TN-పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో 4రోజుల పాటు వర్షాలు కురుస్తాయంది. రేపు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది.
News November 28, 2024
పెట్లూరు సచివాలయాన్ని తనిఖీ చేసిన మంత్రి స్వామి
కొండపి మండలం పెట్లూరులో గ్రామ సచివాలయాన్ని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా రికార్డుల పరిశీలించి, నిర్వహణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సచివాలయ సిబ్బందిని రేషనలైజేషన్ చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. సేవలన్నీ ప్రజలకు సకాలంలో అందించాలని ఉద్యోగులు బాధ్యతాయుతంగా పనిచేయాలని అన్నారు.
News November 28, 2024
టంగుటూరు మహిళ హత్య కేసులో కీలక UPDATE
టంగుటూరులో మంగళవారం జరిగిన<<14720727>> హైమావతి హత్య కేసు దర్యాప్తును<<>> పోలీసులు ముమ్మరం చేశారు. మృతురాలి భర్త, ఇతర అనుమానితుల కాల్ డేటాను ఆధారంగా చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరోపక్క చుట్టుపక్కల CC కెమెరాలను చెక్ చేస్తున్నారు. అప్పటికీ మిస్టరీ విడకపోతే ఇతర కోణాలలో దర్యాప్తు చేస్తామన్నారు. హైమావతిది పేద కుటుంబం కాబట్టి ఆమెను దొంగలు హత్యచేసే అవకాశాలు తక్కువని పోలీసులు అనుమానిస్తున్నారు.