News June 29, 2024
చీరాల: కేసును చేధించిన పోలీసులకు ప్రశంసా పత్రాలు
చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన యువతి అత్యాచారం కేసును బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నేతృత్వంలో 36 గంటల్లోనే ఛేదించారు. ఆ కేసును త్వరితగతిన ఛేదించడంలో కృషి చేసిన 21 మంది పోలీస్ అధికారులను, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. క్లూస్ లేనప్పటికీ, కేసును సవాల్‌గా తీసుకొని త్వరితగతిన ఛేదించారని అన్నారు.
Similar News
News October 16, 2024
ఒంగోలు డివిజన్‌లో వర్షపాత వివరాలు.!
తుఫాను ప్రభావంతో జిల్లాలోని పలు మండలాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయం వరకు నమోదైన వర్షపాత వివరాలు MMలలో ఇలా ఉన్నాయి.
➤ఒంగోలు 14.6, కొత్తపట్నం 7.2.
➤SNపాడు 14.2, చీమకుర్తి 4.4.
➤మద్దిపాడు 6.2, ఎన్ జి పాడు 2.8.
➤ కొండపి 28.4, సింగరాయకొండ 26.4.
➤ టంగుటూరు 38.0, జరుగుమల్లి 39.0.
➤ తాళ్లూరు 7.2 వర్షపాతం నమోదైంది.
News October 16, 2024
మైనర్‌పై లైంగిక దాడి.. ప్రకాశం జిల్లా వాసికి పదేళ్ల జైలు శిక్ష
2019లో వనస్థలిపురం PSలో ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన అనిల్ పై పోక్సో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. ప్రేమ పేరుతో బంధువైన మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం అపహరించి పెళ్లి చేసుకున్న కేసులో నిందితుడికి న్యాయస్థానం పదేళ్ల శిక్ష, రూ.15వేల జరిమానా విధించింది. అనంతరం నిందితుడిని దోషిగా నిర్ధారించి మంగళవారం రంగారెడ్డి జిల్లా జడ్జి శిక్ష విధించారు.
News October 16, 2024
పోలీస్ యంత్రాంగాన్ని సిద్ధం చేసిన ప్రకాశం ఎస్పీ
రానున్న 48 గంటలలో భారీ వర్ష సూచన నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని ఎస్పీ AR దామోదర్ తెలిపారు. ప్రత్యేక బలగాలతో బందోబస్తు, కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, సిబ్బందితో 18 టీంలు ఏర్పాటు చేశామని.. ప్రతి టీంలో 20 మంది ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బంది ఉంటారన్నారు.