News February 17, 2025
చీరాల: టీడీపీలోకి భారీగా చేరికలు

చీరాల మండలం కావూరివారిపాలెం గ్రామానికి చెందిన 150 కుటుంబాలు టీడీపీలో చేరాయి. చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య పార్టీ కండువాలు వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రజలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు.
Similar News
News October 16, 2025
రాష్ట్ర బంద్కు కాంగ్రెస్ పార్టీ మద్దతు: TPCC చీఫ్

ఈ నెల 18న BC సంఘాలు చేపట్టే తెలంగాణ బంద్కు కాంగ్రెస్ మద్దతు ఉంటుందని PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. రిజర్వేషన్లపై వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే బంద్కు BRS, BJP, మావోయిస్టు పార్టీలు సపోర్ట్ తెలపగా తాజాగా అధికార పక్షమూ మద్దతు ప్రకటించింది. దీంతో ఎల్లుండి బంద్ ప్రభావం సంపూర్ణంగా ఉంటుందని స్పష్టమవుతోంది. విద్యాసంస్థలకు యాజమాన్యాలు రేపు చెప్పే అవకాశముంది.
Share It
News October 16, 2025
ఇస్రో షార్లో 141 పోస్టులకు నోటిఫికేషన్

ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో 141 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. టెక్నీషియన్, సైంటిస్ట్, టెక్నికల్ అసిస్టెంట్ తదితర పోస్టులు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు నేటి నుంచి NOV 14వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా, ITI, డిగ్రీ, BSc, MSc, BE, బీటెక్, ME, ఎంటెక్, BLSc, నర్సింగ్ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయసు 18- 35ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్సైట్: https://www.isro.gov.in/
News October 16, 2025
ములుగు: దామోదరన్న లొంగిపోతారా?

మావోయిస్టు పార్టీలో సుదీర్ఘంగా కీలక నేతలుగా ఉన్న ఒక్కొక్కరు లొంగిపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన బడే చొక్కారావు@ దామోదర్ లొంగిపోతారా? పార్టీలో కొనసాగుతారా? అనే చర్చ జరుగుతోంది. 30 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న దామోదర్.. సభ్యుడు, దళ కమాండర్, కేకేడబ్ల్యూగా ఎదిగి, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యత వహిస్తున్నారు.