News April 12, 2024
చీరాల: పురుగు మందు తాగి యువకుడి సూసైడ్

ఇంట్లో వారు మందలించారనే మనస్తాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చీరాల మండలం వాడరేవులో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై శివకుమార్ వివరాల మేరకు.. వేటపాలెం మండలం రామన్నపేటకు చెందిన ఎం.నాగేంద్ర(23) చీరాలలో ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేస్తున్నాడు. ఇటీవల కాలంలో ఉద్యోగానికి వెళ్లకపోవడంతో ఇంట్లో వారు మందలించారు. దీంతో మనస్థాపం చెందిన నాగేంద్ర ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 25, 2025
ఒంగోలు: యువకుల ఫోన్ల తనిఖీ

IPL బెట్టింగ్‌తో పాటు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ వాడే వారి సంఖ్య పెరుగుతోంది. ఈక్రమంలో పోలీసులు నిఘా పెంచారు. ఒంగోలు బస్టాండ్ వద్ద డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు యువకుల ఫోన్లు చెక్ చేశారు. బెట్టింగ్ యాప్స్, సింగిల్ నంబర్ వాడే వారిని గుర్తించారు. 300 మంది అనుమానితులను తనిఖీ చేసి రూ.5,500 సీజ్ చేశారు. యువత బెట్టింగ్‌కు అలవాటై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని డీఎస్పీ కోరారు.
News March 25, 2025
ఒంగోలు: ‘ఫిర్యాదులు సత్వరమే పరిష్కరిస్తాం’

ప్రజల నుంచి వచ్చే పిర్యాదులను పరిష్కరించుటకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమన్ని జిల్లా ఎస్పీ దామోదర్ నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. బాధితుల సమస్యలను శ్రద్ధగా విని, ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, సత్వరం పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. 81 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు.
News March 24, 2025
KG చికెన్‌కు రూ.10టాక్స్.. ఇదేనా విజన్: తాటిపర్తి

యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మరోసారి వ్యంగ్యంగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ‘విజన్ -2047 అంటే KG చికెన్‌కు రూ.10 L&P టాక్స్ కట్టడం. L&P టాక్స్ ఎలా అమలు చేయాలో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్ట్ నడుస్తోంది. కావాలంటే తెలుసుకోండి. భవిష్యత్‌లో ప్రతి కేజీ చికెన్‌పై దోపిడీకి జేబులు సిద్ధం చేసుకోవాలని ప్రజలకు నా విన్నపం’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.