News March 5, 2025
చీరాల: ప్రేమను నిరాకరించిందని యువతిపై దాడి

ప్రేమను నిరాకరించిందని ఓ యువతిపై తీవ్రంగా దాడి చేసిన ఘటన చీరాలలో జరిగింది. యువతి తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. చీరాలలోని ఓ కళాశాలలో బీటెక్ చదువుతున్న పూజేశ్, అదే కళాశాలలోని యువతిని ప్రేమించాలని వేధించేవాడు. అయితే యువతి ప్రేమను నిరాకరించడంతో స్థానిక సముద్రం వద్దకు తీసుకెళ్లి నీటిలో ముంచి, దాడి చేశారని తెలిపారు. తీవ్రంగా గాయపడిన యువతికి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News September 16, 2025
మెగా డీఎస్సీ: విజయవాడలో 5వేల మందికి బస

AP: మెగా DSCలో ఉద్యోగం సాధించిన నూతన టీచర్లకు ఈ నెల 19న CM చంద్రబాబు అమరావతిలో నియామక పత్రాలు అందించనున్నారు. దీని కోసం జోన్-1 పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల నుంచి ఈ నెల 18 సాయంత్రానికి సుమారు 5వేల మంది విజయవాడ రానున్నారు. వారికి బస కోసం 13 పాఠశాలలను కేటాయించారు. అటు రాయలసీమలోని సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి గుంటూరులో ఏర్పాట్లు చేస్తున్నారు.
News September 16, 2025
క్రమంగా తగ్గుతున్న నిరుద్యోగ రేటు

దేశంలో 15 ఏళ్లు, అంతకన్న ఎక్కువ వయసుండి పనిచేసే అవకాశం ఉన్న వ్యక్తుల్లో నిరుద్యోగ రేటు క్రమంగా తగ్గుతోంది. కేంద్రం విడుదల చేసిన కార్మిక సర్వే గణాంకాల ప్రకారం.. ఆగస్టులో నిరుద్యోగ రేటు 5.1%గా నమోదైంది. ఇది జులైలో 5.2 శాతంగా, మే, జూన్ నెలల్లో 5.6 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ రేటు వరసగా మూడో నెలలో కూడా తగ్గింది. మేలో 5.1% ఉన్న రేటు ఆగస్టులో 4.3 శాతానికి తగ్గింది.
News September 16, 2025
జిల్లాలో ఏడు మండలాల ఎంపీడీవోలు బదిలీలు

నెల్లూరు జిల్లాలోని 7 మండలాల్లో ఎంపీడీవోలు బదిలీ చేస్తూ జిల్లా ప్రజా పరిషత్ సీఈవో జే మోహన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ఉదయగిరి శ్రీనివాసులు, దుత్తలూరు చెంచమ్మ, నెల్లూరు రూరల్ ఎంవీ రవణమ్మ, చేజర్ల ఎలిషా బాబు, సైదాపురం ఎంవీ రామ్మోహన్ రెడ్డి, కలువాయి ఏ శైలజ, వరికుంటపాడు డీవీ రమణారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.