News June 16, 2024

చీరాల: బైకును ఢీకొన్న ఆర్టీసీ బస్సు

image

చీరాల రామ్ నగర్ సమీపంలో శనివారం ఆర్టీసీ బస్సు, బైకు ఢీకొనగా ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. రాంనగర్ వద్ద ఒక వేడుక జరుగుతుండడంతో ఒకవైపు రోడ్డుకు తాళ్లు కట్టగా రేపల్లె వెళుతున్న ఆర్టీసీ బస్సు రాంగ్ రూట్‌లో వచ్చి ఎదురుగా వస్తున్న బైకును ఢీకొంది. దీంతో బైకు నడుపుతున్న ఐటీసీ ఉద్యోగి బుచ్చిబాబు కిందపడగా .. తలకు తీవ్ర గాయమైంది. హుటాహుటిన బుచ్చిబాబును గుంటూరుకు తరలించారు.

Similar News

News September 21, 2024

పర్చూరు: ‘జాగ్రత్తగా లేకుంటే మరో బుడమేరు ప్రమాదం’

image

ఉప్పుటూరు గ్రామానికి పక్కనే ఉన్న వాగు వెంబడి కట్టలు తెగి ఉండడం పట్ల గ్రామస్థులు, రైతులు భయాందోళన చెందుతున్నారు. గతంలో వచ్చిన తుఫాను కారణంగా కట్టలు తెగాయని అవి బాగుచేయకుంటే మరో బుడమేరు ప్రమాదాన్ని పర్చూరులో చూడాలని గ్రామస్థులు అంటున్నారు. ప్రభుత్వం స్పందించి కట్టలను బాగుచేయాలని వాగువెంబడే అనుకొని ఉన్న ఉప్పుటూరు, వీరన్నపాలెం గ్రామవాసులు కోరుతున్నారు.

News September 21, 2024

బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కరణం వెంకటేష్?

image

బాపట్ల జిల్లా వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు, ముఖ్య నేతల సమావేశం అధినేత జగన్ సమక్షంలో శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా చీరాల ఇన్ ఛార్జ్ కరణం వెంకటేష్‌ను నియమించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రకాశం జిల్లా నూతన అధ్యక్షుడిగా దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే.

News September 20, 2024

ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే బూచేపల్లి?

image

ప్రకాశం జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా దర్శి ఎమ్మెల్యే డా.బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని శుక్రవారం వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇవాళ జిల్లాలోని నేతలు అందరితో సమావేశం నిర్వహించి చర్చించారు. అనంతరం జిల్లా నేతలు అందరూ బూచేపల్లిని సన్మానించారు. దీంతో ఆయనకు జిల్లా అధ్యక్ష పదవి ఆయనకు ఇచ్చారని దర్శి నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.