News August 21, 2024
చీరాల: మరో ఇద్దరు దొరికారు

చీరాల సమీపంలోని ఈపూరుపాలెం యువకుడు ఆరిఫ్ హత్య కేసులో మరో ఇద్దరు నిందితులను మంగళవారం అరెస్టు చేసినట్లు DSP జగదీశ్ నాయక్ వెల్లడించారు. ఈ నేరానికి ఉపయోగించిన కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మొత్తం 8 మందిని నిందితులుగా గుర్తించారు. ఇంతకుముందే ఆరుగురి పట్టుబడగా.. తాజాగా పరారీలో ఉన్న గరిక మహేంద్ర, కర్రెద్దుల వంశీకుమార్ దొరికారు. త్వరలోనే పక్కాగా ఛార్జ్‌షీట్ వేస్తామని DSP చెప్పారు.
Similar News
News November 26, 2025
29న ఒంగోలులో విభిన్న ప్రతిభావంతులకు క్రీడా పోటీలు

ఒంగోలులోని డీఆర్ఆర్ఎం హై స్కూల్లో ఈనెల 29న అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకల సందర్భంగా దివ్యాంగుల కోసం ప్రత్యేక క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు సువార్త తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో బుధవారం ఆమె మాట్లాడారు. విభిన్న ప్రతిభావంతులను క్రీడా పోటీలలో సైతం ప్రోత్సహించేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులు పాల్గొనాలని కోరారు.

ప్రకాశం: తుఫాన్‌ను లెక్కచేయని వనిత.. అసలు స్టోరీ ఇదే!

నాగులుప్పలపాడు మండలం పోతవరానికి చెందిన మహిళా రైతు వనిత.. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 2021 నుంచి ఇదే పద్ధతి పాటిస్తున్న ఆమె అద్భుత విజయాలు సాధించారు. ప్రస్తుతం మొక్కజొన్న, కంది, బీరకాయ పంటలను 2.20 ఎకరాల భూమిలో సాగు చేశారు. మొన్న మొంథా తుఫాన్‌తో మిగిలిన రైతుల పంట దెబ్బతింటే, ఈమె పంట సేఫ్. దీంతో రూ.8500 పెట్టుబడి ఖర్చుకు రూ.53,460 ఆదాయం గడించారు.