News April 15, 2025
చీరాల : మార్కులు తక్కువ వచ్చాయని ఆత్మహత్య

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలలో తక్కవ మార్కులు వచ్చాయని చీరాలలోని తులసీనగర్‌కు చెందిన కృషల్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడలోని ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతున్నాడు. తక్కువ మార్క్స్ వచ్చాయని బెటర్‌మెంట్ రాసుకుంటానని ఆదివారం రాత్రి తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. సోమవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడని ప్రిన్సిపల్ సమాచారమిచ్చాడు. తండ్రి వీరా వర్మరెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదుచేసినట్లు పటమట పోలీసులు తెలిపారు.
Similar News
News July 7, 2025
రూ.23 లక్షలతో దుబాయ్ గోల్డెన్ వీసా

భారత్, బంగ్లాదేశ్ ప్రజలు లక్ష ఏఈడీ (రూ.23.30 లక్షలు)లు చెల్లిస్తే దుబాయ్ గోల్డెన్ వీసా పొందొచ్చు. గతంలో రూ.4.66 కోట్లకుపైగా పెట్టుబడి పెడితే గోల్డెన్ వీసా మంజూరు చేసేది. ఇప్పుడు డైరెక్ట్‌గా డబ్బు చెల్లించి వీసా తీసుకోవచ్చు. ఈ వీసా పొందినవారు తమ ఫ్యామిలీతో దుబాయ్‌లో నివసించవచ్చు. డ్రైవర్లు, పనిమనుషులను ఏర్పాటు చేసుకోవచ్చు. ఏదైనా జాబ్, బిజినెస్ చేసుకునే ఛాన్స్ ఉంది. జీవితకాలం అక్కడే ఉండొచ్చు.
News July 7, 2025
షార్ట్ ఫిలిం పోటీలకు దరఖాస్తు చేసుకోండి: ములుగు కలెక్టర్

జాతీయ మానవ హక్కుల సంఘం(NHRC) ఆధ్వర్యంలో నిర్వహించే షార్ట్ ఫిలిం పోటీలకు అన్ని వర్గాల ప్రజల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. మానవ హక్కులపై అవగాహన కల్పించే విధంగా 3 నుంచి 10 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిలింలను nhrcshrotfilm@gmail.comకు పంపించాలన్నారు. విజేతలుగా నిలిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు రూ.2 లక్షల నుంచి రూ.లక్ష వరకు అందిస్తారన్నారు.
News July 7, 2025
నస్పూర్: జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకం

హైదరాబాద్‌లో 5 రోజులుగా జరుగుతున్న జాతీయస్థాయి జూనియర్ వుషూ పోటీల్లో నస్పూర్‌కు చెందిన అత్కపురం హాసిని ప్రతిభ కనబరిచి టైలు విభాగంలో బంగారు పథకం సాధించింది. తెలంగాణ SAI ఛైర్మన్ శివసేన రెడ్డి, వైస్ ఛైర్మన్ సోని బాలదేవి చేతులమీదుగా బంగారు పథకాన్ని హాసిని అందుకుంది. క్రీడాకారిణి హాసిని, కోచ్ శివమహేశ్‌ను జిల్లా వుషూ సంఘం ప్రెసిడెంట్ వేముల సతీశ్, జనరల్ సెక్రటరీ రాజనర్సు అభినందించారు.