News July 4, 2024
చీరాల రాజకీయాల్లో పెను విస్ఫోటనం

చీరాలకు చెందిన 11 మంది కౌన్సిలర్లు బుధవారం టీడీపీ ఎమ్మెల్యే కొండయ్యకు మద్దతు పలికారు. వీరిలో ఏడుగురు వైసీపీ కౌన్సిలర్లు, నలుగురు ఇండిపెండెన్స్ కౌన్సిలర్లు ఉన్నారు. వార్డుల అభివృద్ధి కోసమే కొండయ్యకు మద్దతు ఇచ్చామని వారు తెలిపారు. దీంతో చీరాలలో వైసీపీకి గట్టి షాక్ తగిలే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో వారు టీడీపీ కండువాలు కప్పుకునే అవకాశం ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు.
Similar News
News October 28, 2025
ప్రకాశం జిల్లాలో పునరావాసాలకు 2900 మంది

తుఫాన్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 65 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 2900 మందిని తరలించినట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టర్ మంగళవారం సాయంత్రం ఒంగోలులోని కలెక్టరేట్లో మాట్లాడుతూ.. ఒంగోలు నగరంలో 30 లోతట్టు కాలనీలను గుర్తించామని, కోస్తా మండలాల్లో 10 లోతట్టు ఆవాస ప్రాంతాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. 2 రోజులపాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News October 28, 2025
ప్రకాశం: ‘గర్భవతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి’

గర్భవతులు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ సుధా మారుతి తెలిపారు. తుఫాన్ ప్రభావం వల్ల గర్భవతులు అప్రమత్తంగా ఉండాలని, డెలివరీ తేదీకంటే ముందుగానే హాస్పిటల్లో చూపించుకోవాలని తెలిపారు. ప్రతి గర్భిణీ స్త్రీ ఆరోగ్యాన్ని అంగన్వాడీలు స్వయంగా వారి ఇంటికి వెళ్లి పరిశీలించడం జరుగుతుందన్నారు. చిన్నారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News October 28, 2025
ప్రకాశం: జాతీయ రహదారులపై రాకపోకలు నిషేధం

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని జాతీయ రహదారుల్లో భారీ వాహనాల రాకపోకలను రాత్రి 7 గంటల నుంచి నిలిపివేస్తున్నట్లు SP హర్షవర్ధన్ రాజు ప్రకటన విడుదల చేశారు. అలాగే జాతీయ, రాష్ట్ర రహదారుల్లో వాహనాల ప్రయాణం నిషేధించడం జరిగిందని, ప్రజా రక్షణ నిమిత్తం తీసుకున్న నిర్ణయాన్ని వాహనదారులు పాటించాలని ఎస్పీ సూచించారు.


