News August 19, 2024

చీరాల రైల్వే స్టేషన్ @125

image

చీరాల రైల్వే స్టేషన్ ఏర్పాటై 125 ఏళ్లు పూర్తయ్యాయి. దేశంలో వివిధ ప్రాంతాలను కలుపుతూ బ్రిటిష్ పాలకులు రైల్వే లైను నిర్మించారు. ఇందులో భాగంగా కోల్ ‌కతా, చెన్నై ప్రధాన రహదారిలో చీరాల రైల్వేస్టేషన్‌ను 1899లో అప్పటి పాలకులు ఏర్పాటు చేశారు. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్, విజయవాడ రైల్వే డివిజన్ పరిపాలన కింద ఉంది.

Similar News

News October 16, 2025

ప్రకాశం జిల్లాలో 2 హైవేలు ప్రారంభం.!

image

కర్నూలు జీఎస్టీ సభ వేదికగా ప్రధాని మోదీ వివిధ పనులను గురువారం ప్రారంభించారు. మరికొన్ని ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. వాటిలో ప్రకాశం జిల్లాలో (1) కనిగిరి బైపాస్ (2) సీఎస్‌పురం 2 లైన్ బైపాస్‌లను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. అలాగే రూ.4,920 కోట్లతో ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది.

News October 16, 2025

ప్రకాశం వంటకాలలో స్పెషల్ ఇదే!

image

నేడు ప్రపంచ భోజన దినోత్సవం. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా వంటకాల స్పెషాలిటీ చూస్తే నోరు ఊరాల్సిందే. జిల్లాలో ప్రధానంగా ఊరగాయ పచ్చళ్లు వెరీ ఫేమస్ అని చెప్పవచ్చు. అంతేకాదు ఒంగోలు నగరానికి ఎవరైనా వచ్చారంటే చాలు.. ఇక్కడి వంటకమైన మైసూర్ పాక్‌ను రుచి చూడాల్సిందే. ఒంగోలు నగరం నుంచి విదేశాలకు కూడా మైసూర్ పాక్ తరలి వెళుతుందంటే.. ఆశ్చర్యం కలిగించక మానదు. మరి మీరు మైసూర్ పాక్ టేస్ట్ అనే చేశారా!

News October 16, 2025

ఉపాధి అవకాశాలు కల్పించాలి: కలెక్టర్ ఆదేశం

image

నైపుణ్యాభివృద్ధి, మరిన్ని ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా పరిశ్రమలు, అనుబంధ విభాగాలు పని చేయాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు స్పష్టం చేశారు. జిల్లా పరిశ్రమల కేంద్రం, ఏపీఐఐసీ ఉన్నతాధికారులతో బుధవారం ఒంగోలు ప్రకాశం భవనంలోని తన చాంబర్లో ఆయన ప్రత్యేకంగా సమీక్షించారు. జిల్లాలో పరిశ్రమల స్థితిగతులు, కొత్త వాటిని స్థాపించేందుకు అవకాశం ఉన్న రంగాల గురించి అధికారులు వివరించగా, కలెక్టర్ పలు సూచనలు చేశారు.