News May 26, 2024
చీరాల: సాయం చేయబోయి మృత్యుఒడిలోకి..

చీరాల ఆరబిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంపన పవన్ కుమార్ అనే ట్రిపుల్ ఐటీ విద్యార్థి శనివారం మృతి చెందాడు. ఈపూరుపాలెం నుంచి చీరాలకు పవన్ కుమార్ బైకుపై వస్తుండగా మార్గమధ్యంలో ఒక యువకుడు లిఫ్ట్ అడిగి తనను రైల్వే స్టేషన్ వద్ద దింపమని కోరాడు. అతడిని ఎక్కించుకొని ఆరబి మీద వెళుతూ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పవన్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.
Similar News
News November 12, 2025
తెలంగాణలో ప్రకాశం జిల్లా వాసి మృతి

ప్రకాశం జిల్లా వాసి జగిత్యాల జిల్లాలో మృతి చెందిన ఘటన మంగళవారం జరింగింది. జిల్లాలోని బీర్పూర్ (M) చిన్నకొల్వాయిలో లిఫ్ట్ ఇరిగేషన్ బావిలో పడి వలస కూలీ మృతి చెందాడు. కాగా మృతుడు ప్రకాశం జిల్లా కలికివాయ బిట్రగుంటకి చెందిన రామకృష్ణ(52)గా గుర్తించారు. ఇతనితోపాటు మరికొంతమంది బావిలో ఇసుక పూడిక తీస్తుండగా రామకృష్ణ ప్రమాదవశాత్తు బావిలో మృతి చెందాడు. కాగా బీర్పూర్ SI, పరిశీలించి కేసు నమోదు చేశారు.
News November 11, 2025
ప్రకాశం: ఉండవల్లికి బయలుదేరిన సీఎం

ఇవాళ పెద్ద చెర్లోపల్లి మండలంలో MSME ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు వచ్చారు. అనంతరం సభా ప్రాంగణంలో ఆయన పలు విషయాలను ప్రజలతో పంచుకున్నారు. వెలుగొండ ప్రాజెక్టుకు నీరు తెచ్చి కనిగిరిని కనకపట్నంగా తీర్చుదిద్దుతానని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లాలో MSME ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపనలు చేశారు. అనంతరం అక్కడి నుంచి హెలికాఫ్టర్లో ఉండవల్లికి బయలుదేరారు.
News November 11, 2025
త్వరలో కనిగిరి కనకపట్నం అవుతుంది: సీఎం చంద్రబాబు

1996లో తాను ప్రారంభించిన వెలుగొండ ప్రాజెక్టును 2026 నాటికి పూర్తి చేసి కనిగిరి ప్రజలకు నీరు అందిస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇవాళ పెద్ద చెర్లోపల్లి మండలంలో MSME పార్కు ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. శ్రీశైలం నుంచి కాకుండా గోదావరి నీళ్లు కూడా జిల్లాకు తీసుకొస్తానని అన్నారు. ఇది జరిగితే కనిగిరి కనకపట్నం అవుతుందని పేర్కొన్నారు. అలాగే పామూరుకు రైల్వే స్టేషన్ వస్తుందని చెప్పుకొచ్చారు.


