News May 26, 2024

చీరాల: సాయం చేయబోయి మృత్యుఒడిలోకి..

image

చీరాల ఆరబిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంపన పవన్ కుమార్ అనే ట్రిపుల్ ఐటీ విద్యార్థి శనివారం మృతి చెందాడు. ఈపూరుపాలెం నుంచి చీరాలకు పవన్ కుమార్ బైకుపై వస్తుండగా మార్గమధ్యంలో ఒక యువకుడు లిఫ్ట్ అడిగి తనను రైల్వే స్టేషన్ వద్ద దింపమని కోరాడు. అతడిని ఎక్కించుకొని ఆరబి మీద వెళుతూ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పవన్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.

Similar News

News February 16, 2025

ప్రకాశం: నిర్లక్ష్యానికి ముగ్గురు బలి

image

పల్నాడు జిల్లా నెమలిపురి దగ్గర అద్దంకి-నార్కెట్ పల్లి హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రకాశం జిల్లా వాసులు మృతిచెందిన విషయం తెసిందే. హైదరాబాద్ నుంచి మద్దిపాడుకు వస్తుండగా లారీ, కారును ఢీకొట్టింది. తల్లి, ఇద్దరు కుమారులు మృతిచెందారు. ఎస్పీ శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
ప్రమాదానికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.

News February 16, 2025

ప్రకాశం: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

image

పల్నాడు జిల్లా రాజుపాలెం(M) నెమలిపురి దగ్గర అద్దంకి- నార్కెట్ పల్లి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా మద్దిపాడు వెళుతున్న కారును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు కొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ప్రకాశం జిల్లాకు చెందిన షేక్ నజీమా, నూరుల్లా, హబీబుల్లాగా గుర్తించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News February 16, 2025

ఒంగోలు: ‘దివ్యాంగుల అర్జీలను సత్వరమే పరిష్కరించాలి’

image

దివ్యాంగుల సమస్యలను పరిష్కరించడంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం శనివారం ప్రకాశం భవనంలో ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సుమారు 60 మంది దివ్యాంగులు వారి సమస్యలపై అర్జీలను సమర్పించినట్లు చెప్పారు. సత్వరమే ఈ అర్జీలను పరిష్కరించాలని అధికారులను ఆమె ఆదేశించారు.

error: Content is protected !!