News April 3, 2025
చీరాల: హత్యాయత్నం కేసులో ఐదుగురి అరెస్ట్

చీరాల రూరల్ పోలీసులు హత్యాయత్నం కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట చేసినట్లు డీఎస్పీ మహమ్మద్ మెయిన్ ఈపురుపాలెం పోలీస్ స్టేషన్లో గురువారం వివరాలు వెల్లడించారు. ఆయన వివరాల మేరకు.. చీరాల మండలం గవినివారి పాలెంలో ఓ స్థలం వివాదంలో ఇటీవల సీఆర్పీఎఫ్ జవాన్పై హత్యాయత్నం చేసినట్లు కేసు నమోదైందన్నారు. గురువారం నిందితులను రూరల్ పోలీసులు అరెస్టు చేశారని ఆయన పేర్కొన్నారు.
Similar News
News December 5, 2025
నెల్లూరు: ప్రభుత్వ అధికారి సస్పెండ్

దుత్తలూరు-1 VROగా పని చేస్తున్న చింతలచెరువు శ్రీనివాసులును సస్పెండ్ చేస్తూ జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ వివరాలను తహశీల్దార్ యనమల నాగరాజు వెల్లడించారు. గతంలో ఏరుకొల్లు VROగా పనిచేస్తున్న సమయంలో అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందకుండా చేయడంతో పాటు వారి పట్ల దురుసుగా ప్రవర్తించారని గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
News December 5, 2025
రాజమహేంద్రవరం: 7న ‘శ్రీ షిర్డిసాయి’లో స్కాలర్షిప్ టెస్ట్

పదో తరగతి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఆదివారం మెగా స్కాలర్షిప్ టెస్ట్, అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు శ్రీ షిర్డిసాయి విద్యాసంస్థల డైరెక్టర్ టి.శ్రీవిద్య తెలిపారు. బీజపురి క్యాంపస్లో ఉదయం 9 గంటలకు కార్యక్రమం ఉంటుందన్నారు. జేఈఈ, నీట్, సివిల్స్ కోర్సులపై నిపుణులు దిశానిర్దేశం చేస్తారని చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్ పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9281030301 నంబర్ను సంప్రదించాలన్నారు.
News December 5, 2025
అమెరికాలో ఇద్దరు తెలుగు స్టూడెంట్స్ మృతి

అమెరికాలోని బర్మింగ్హోమ్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. అలబామా యూనివర్సిటీలో చదివే 10 మంది తెలుగు స్టూడెంట్స్ అక్కడి అపార్ట్మెంట్లో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే భవనంలో అగ్నిప్రమాదం జరగడంతో ఇద్దరు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.


