News July 12, 2024
చీరాల: IIITలో టాప్ లేపిన ఈపూరుపాలెం గర్ల్స్ హైస్కూల్

చీరాల మండలం ఈపూరుపాలెం జిల్లా పరిషత్ గర్ల్స్ హైస్కూల్‌లో 10 మంది IIITలో సీట్లు సాధించారు. చీరాల డివిజన్‌లో అత్యధికంగా IIIT సీట్లు సాధించిన హైస్కూల్ ఇదే కావటం విశేషం. విద్యార్థులను శుక్రవారం స్కూల్లో జరిగిన సభలో హెచ్ఎం అనోరా, ఉపాధ్యాయ బృందం, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు అభినందించారు. ఇలాగే కష్టపడి స్కూల్‌కు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు హెచ్‌ఎం సూచించారు.
Similar News
News February 25, 2026
మార్కాపురం జిల్లా అభివృద్ధికి CM వరాలు కురిపిస్తారా..?

మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత మొదటిసారి CM చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో భారీగా ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జిల్లా ఏర్పాటుచేయగా వెలుగొండ ప్రాజెక్టు పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే సీఎం జిల్లా అభివృద్ధికి ఎలాంటి వరాలు కురిపిస్తారోనని నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
News February 25, 2026
ఇవాళ మార్కాపురం జిల్లాకు CM.. షెడ్యూల్ ఇదే.!

CM చంద్రబాబు బుధవారం మార్కాపురం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన పర్యటన షెడ్యూల్ CMO అధికారులు విడుదల చేశారు. ఇవాళ మధ్యాహ్నం 12:50కి దోర్నాలలోని వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేసి, పనులను పరిశీలించి మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడే ఉంటారు. మధ్యాహ్నం 2:30కి మార్కాపురంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం 4:40కి తిరిగి వెలగపూడికి బయలుదేరుతారు.