News March 28, 2024

చీరాల: TDP అభ్యర్థి ఫ్యాక్టరీలో రూ.56 లక్షలు స్వాధీనం

image

చీరాల మండలం కావూరివారి పాలెంలోని బాపట్ల అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి వేగేశన నరేంద్రవర్మకు చెందిన రాయల్ మెరైన్ ఫ్యాక్టరీలో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.56 లక్షల నగదును గురువారం పోలీసులు స్వాధీన పరుచుకున్నారు. పక్కాగా అందిన సమాచారంతో చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్, రూరల్ సీఐ నిమ్మగడ్డ సత్యనారాయణ తమ సిబ్బందితో మెరుపు దాడి చేసి నగదును సీజ్ చేశారు.

Similar News

News November 24, 2025

రాచర్ల: పొలంలో నీళ్లు పెడుతుండగా.. కరెంట్ షాక్‌కి గురై..

image

రాచర్ల మండలం ఆకవీడుకు చెందిన చిట్టిబాబు చిన్న కుమారుడు రాజేశ్ విద్యుత్ షాక్‌కు గురై ఆదివారం మృతి చెందారు. మొక్కజొన్న పొలంలో నీళ్లు పెడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురై మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో కుటుంబం శోకసముద్రంలో మునిగింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

News November 24, 2025

ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీగా బాపట్ల ఎస్పీ

image

ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీగా బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ నియమించబడ్డారు. ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు డిసెంబర్ రెండు వరకు సెలవుల్లో ఉండడంతో, ప్రభుత్వం ఈ మేరకు బాపట్ల ఎస్పీని ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. దీనితో జిల్లా బాధ్యతలను బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ చేపట్టారు. డిసెంబర్ మూడో తేదీన ఎస్పీ హర్షవర్ధన్ రాజు మళ్లీ విధుల్లో చేరనున్నారు.