News March 28, 2024
చీరాల: TDP అభ్యర్థి ఫ్యాక్టరీలో రూ.56 లక్షలు స్వాధీనం
చీరాల మండలం కావూరివారి పాలెంలోని బాపట్ల అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి వేగేశన నరేంద్రవర్మకు చెందిన రాయల్ మెరైన్ ఫ్యాక్టరీలో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.56 లక్షల నగదును గురువారం పోలీసులు స్వాధీన పరుచుకున్నారు. పక్కాగా అందిన సమాచారంతో చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్, రూరల్ సీఐ నిమ్మగడ్డ సత్యనారాయణ తమ సిబ్బందితో మెరుపు దాడి చేసి నగదును సీజ్ చేశారు.
Similar News
News January 13, 2025
గుడ్లూరు వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
గుడ్లూరు మండలం చేవూరు జాతీయ రహదారిపై సోమవారం బైకు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయినట్లు స్థానికులు తెలిపారు. చెన్నై నుంచి కరీంనగర్ వెళ్తున్న కారు చేవూరు వద్ద మోటర్ బైక్‌ను ఢీకొంది. బైక్‌పై ప్రయాణిస్తున్న వెంకటేశ్వర్లు, కారులో పయనిస్తున్న అధ్విక రాజ్ అనే పాప అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను కావలి వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
News January 13, 2025
మార్కాపురం: దారణ హత్య.. హంతకులు ఎవరంటే?
మార్కాపురం మండలం కొత్తపల్లికి చెందిన సుబ్బలక్ష్మమ్మకు 30 ఏళ్ల క్రితం వెంకటేశ్వర్లతో వివాహమైంది. అదే గ్రామానికి చెందిన వెంకటనారాయణతో తన భార్య అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో వెంకటనారాయణను 2005వ సం”లో వెంకటేశ్వర్లు హత్య చేసి 9 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. కాగా సుబ్బలక్ష్మమ్మ తన పద్ధతి మార్చుకోలేదనే అనుమానంతో వెంకటేశ్వర్లు తన ఇద్దరు తమ్ముళ్లతో కలిసి 4 రోజుల క్రితం భార్యను హత్య చేశాడు.
News January 13, 2025
ప్రకాశం: జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక
ప్రకాశం జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే “ప్రజా సమస్యల పరిష్కార వేదిక”ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ తమిమ్ అన్సారియా ప్రకటన విడుదల చేశారు. సోమవారం భోగి సందర్భంగా తాత్కాలికంగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. సుదూర ప్రాంతాల నుంచి కలెక్టర్ కార్యాలయానికి వచ్చే అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి సిబ్బందికి సహకరించాలని కోరారు.