News October 2, 2024
చుండూరు: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
గూడ్స్ రైలు పట్టాలు తప్పిన సంఘటన చుండూరు రైల్వే స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. తెనాలి నుంచి చుండూరు మధ్య గల రైల్వే పట్టాలపై గూడ్స్ రైలు వెనక ఉన్న బ్రేక్ వ్యాన్ పట్టాలు తప్పడంతో రైలును నిలిపివేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News October 15, 2024
గుంటూరు: భార్యాభర్తలకు జాక్‌పాట్.. ఏకంగా 6 షాపులు
గుంటూరు జిల్లాలో మద్యం దుకాణాలు నిర్వహించిన లాటరీలో భార్య భర్తలకు ఏకంగా ఆరు మద్యం దుకాణాలు లభించడంతో సంబరాలు చేసుకుంటున్నారు. గుంటూరులో ఒక బారు నిర్వహిస్తున్న యజమాని తన అదృష్టాన్ని పరిశీలించుకోవటానికి తన భార్య పేరుతో కలిసి 40 దరఖాస్తులు చేశారు. వారికి జిల్లాలో ఆరు మద్యం దుకాణాలు లాటరీలో రావటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
News October 15, 2024
గుంటూరు: మహిళలకు ఎన్ని మద్యం షాపులు వచ్చాయంటే?
ఉమ్మడి గుంటూరు జిల్లాలో పోలీసుల బందోబస్తు మధ్య మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ ముగిసింది. 373 షాపులకు 9,191 దరఖాస్తులు వచ్చాయి. కాగా గుంటూరు జిల్లాలో 4 గంటల్లోనే లాటరీ ప్రక్రియ ముగియడం విశేషం. గుంటూరు జిల్లాలో 127 షాపులకు 11 మహిళలకు దక్కాయి. అటు బాపట్ల జిల్లాలో 117 దుకాణాలకు గాను 7, పల్నాడు జిల్లాలో 129 షాపులకు 7 చోట్ల మహిళలకు దక్కాయి. అత్యధికంగా మంగళగిరిలో 28 షాపులకు 6 మహిళలకే దక్కడం విశేషం.
News October 15, 2024
గుంటూరు: ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో టీవీ అండ్ ఫిల్మ్ స్టడీస్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కోర్స్ కో-ఆర్డినేటర్ మధుబాబు సోమవారం తెలిపారు. రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ విధానంలో ఈ కోర్సును నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కోర్సులో ప్రవేశాలు పొందేందుకు ఏదైనా డిగ్రీ కోర్స్ ఉత్తీర్ణత కలిగి ఉండాలని సూచించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.