News July 10, 2024
చూపరులను ఆకట్టుకున్న అనంతపురం నగర వాతావరణం

అనంతపురం జిల్లాలో ఇవాళ సాయంత్రం విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఒకపక్క ఎండ, మరోపక్క మేఘావృతమై విభిన్న వాతావరణం కనిపించింది. బుక్కరాయసముద్రం కొండపై పూర్తిగా మేఘాలు కమ్ముకున్నాయి. నగరంలో కొన్ని రోజులుగా మేఘావృతమై చిరుజల్లులు కురుస్తున్నాయి. అనంతపురం రూరల్ పరిధిలో పలువురు రైతులు వేరుశనగ, ఆముదం, కంది పంట విత్తనం వేయడానికి సిద్ధమయ్యారు.
Similar News
News November 13, 2025
10 మంది ఉద్యోగులకు ఎంపీడీఓలుగా పదోన్నతి!

అనంతపురం జిల్లా పరిషత్ యాజమాన్యం కింద పని చేస్తున్న 10 మందికి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు (ఎంపీడీఓ)గా పదోన్నతి లభించింది. గురువారం జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ బోయ గిరిజమ్మ తన క్యాంపు కార్యాలయంలో వారికి నియామక పత్రాలు అందించారు. పదోన్నతి పొందిన ఉద్యోగులు పంచాయతీరాజ్ వ్యవస్థకు మంచి పేరు తీసుకురావాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సీఈఓ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.
News November 13, 2025
భార్యను హతమార్చిన భర్త

అనంతపురం జిల్లా బెలుగుప్పలో గురువారం దారుణ ఘటన జరిగింది. భార్యను భర్త హతమార్చాడు. స్థానికుల వివరాల మేరకు.. భార్య శాంతిని భర్త ఆంజనేయులు కొడవలితో నరికి చంపాడు. హత్య తర్వాత నిందితుడు బెలుగుప్ప పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. కుటుంబ కలహాలే ఘటనకు కారణంగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 13, 2025
భార్యపై హత్యాయత్నం.. భర్త అరెస్టు: సీఐ

కళ్యాణదుర్గం మండలం బోరంపల్లిలో భార్య రత్నమ్మపై హత్యాయత్నం చేసిన ఆమె <<18270800>>భర్త<<>> ఎర్రి స్వామిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. బుధవారం రాత్రి ఎర్రి స్వామి కత్తితో రత్నమ్మ గొంతు కోయడానికి యత్నించాడు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లు రూరల్ సీఐ హరినాథ్ తెలిపారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.


