News February 28, 2025
చెంచుల సంక్షేమానికి తోడ్పాటు: నంద్యాల కలెక్టర్

చెంచు గిరిజనులు తమ జీవన ప్రమాణాలను పెంపొందించుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా పేర్కొన్నారు. శుక్రవారం ఆత్మకూరు మండలంలోని బైర్లూటి చెంచుగూడెం పరిధిలో నన్నారి మొక్కల సాగుపై వారితో మాట్లాడారు. చెంచుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, శ్రీశైలం ఐటీడీఏ పీవో శివప్రసాద్ ఉన్నారు.
Similar News
News November 21, 2025
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు: NZB కలెక్టర్

రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తు.చా తప్పక పాటిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని NZB కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి నోడల్ అధికారులను ఆదేశించారు. ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా సమన్వయంతో పనిచేస్తూ, ఎన్నికలను సాఫీగా నిర్వహించాలని సూచించారు. అధికారులు, సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉంటూ తమకు అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు.
News November 21, 2025
బాపుఘాట్లో ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహం

HYDలో ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహం ఏర్పాటుకు చర్యలు ప్రారంభం అయ్యాయి. ఈసా, మూసీ నదుల సంగమం బాపుఘాట్ వద్ద గాంధీ సరోవర్లో గాంధీ విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం పట్నాలోని గాంధీ మైదానంలో 72 అడుగుల కాంస్య విగ్రహం దేశంలోనే ఎత్తైంది. దీనికంటే ఎత్తైన విగ్రహం ఏర్పాటుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
News November 21, 2025
అనకాపల్లి: ఎన్టీఆర్ హౌసింగ్ స్కీం కోసం దరఖాస్తు చేసుకోవాలి

ఎన్టీఆర్ హౌసింగ్ స్కీం మంజూరు కోసం అర్హత కలిగిన లబ్ధిదారులు ఈనెల 30 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్ బత్తుల తాతయ్యబాబు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలలో ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్తో దరఖాస్తు సమర్పించాలన్నారు. అర్బన్, రూరల్ హౌసింగ్ స్కీంలలో మూడు కేటగిరీల విభాగాలలో ఇల్లు మంజూరు చేస్తామన్నారు. స్థలం లేని వారికి స్థలంతో ఇళ్లు కూడా మంజూరు చేస్తామని పేర్కొన్నారు.


