News February 28, 2025
చెంచుల సంక్షేమానికి తోడ్పాటు: నంద్యాల కలెక్టర్

చెంచు గిరిజనులు తమ జీవన ప్రమాణాలను పెంపొందించుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా పేర్కొన్నారు. శుక్రవారం ఆత్మకూరు మండలంలోని బైర్లూటి చెంచుగూడెం పరిధిలో నన్నారి మొక్కల సాగుపై వారితో మాట్లాడారు. చెంచుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, శ్రీశైలం ఐటీడీఏ పీవో శివప్రసాద్ ఉన్నారు.
Similar News
News March 20, 2025
పామాయిల్ సాగుతో లాభాలు: వనపర్తి కలెక్టర్

పామాయిల్ సాగు చేస్తే ఎంతో లాభదాయకంగా ఉంటుందని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. రైతులకు అవగాహన కల్పించి పామాయిల్ సాగుకు ప్రోత్సహించాలని ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. పంట సాగు 4 సంవత్సరాల వరకు రైతులకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని, పంటను కంపెనీ వారే కొనుగోలు చేస్తారని పేర్కొన్నారు. 4 సంవత్సరాలు చూసుకుంటే 35 సంవత్సరాల పాటు లాభాలను ఆర్జించవచ్చని తెలిపారు.
News March 20, 2025
వనపర్తి: ఈ యాప్ డౌన్లోడ్ చేశారంటే మీ అకౌంట్ ఖాళీ: పోలీసులు

వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం తాడిపర్తి గ్రామ వాట్సాప్ గ్రూపులో పీఎం కిసాన్ నిధి యోజన అనే APK డాక్యుమెంట్ వాట్సాప్ గ్రూప్‌లో రావడంతో కొందరు యువకులు డాక్యుమెంట్ డౌన్లోడ్ చేయగా వారి ఫోన్ హ్యాకింగ్ గురై వాట్సాప్ గ్రూపులన్నింటికీ APK ఫార్వర్డ్ అవుతుంది. కావున పీఎం కిసాన్ యోజన్ అంటూ మెసేజ్ వస్తే దాన్ని ఓపెన్ చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
News March 20, 2025
పారిశ్రామిక విధానాలపై ప.గో అధికారులకు అవగాహన

స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కలల సాకారంలో భాగంగా ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల రీసైక్లింగ్ పరిశ్రమల స్థాపనకు ఔత్సాహికవేత్తలు కృషి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమలు,ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన వివిధ పారిశ్రామిక విధానాల గురించి అధికారులకు అవగాహన కల్పించారు.