News February 25, 2025
చెడు వ్యక్తులతో స్నేహం చేయకండి : ఎస్పీ

చెడు వ్యక్తులతో స్నేహం చేస్తే మనకు కూడా ఆ అలవాట్లు వచ్చే అవకాశం ఉందని అన్నమయ్య ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హితవు పలికారు. సోమవారం రాయచోటిలో మాట్లాడుతూ.. మన స్నేహితులు సిగరెట్స్, మద్యంతాగడం, డ్రగ్స్ తీసుకోవడం, ఇంకా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తే, మనం కూడా వాటికి బానిసయ్యే ప్రమాదం ఉందన్నారు. చెడు వ్యక్తులు మనల్ని తప్పుదారి పట్టించవచ్చు. మోసం చేయవచ్చు లేదా మనల్ని నేరాలకు పాల్పడేలా చేయవచ్చన్నారు.
Similar News
News December 4, 2025
ఇలా చేస్తే.. హ్యాకర్లకి చిక్కరు!

రోజురోజుకీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. హిస్టరీ డిలీట్ చేయడం, ప్రైవేట్ ట్యాబ్ ఉపయోగించడం నిజమైన రక్షణ కాదని నిపుణులు అంటున్నారు. పూర్తిస్థాయి ప్రైవసీ కోసం జీరో-లాగ్ VPN వాడటం వల్ల బ్రౌజ్ చేసేటప్పుడు హిస్టరీ సేవ్ అవ్వదు. బ్రౌజింగ్కి వేర్వేరు డివైజ్‌లు ఉపయోగించడం వల్ల డేటా ట్రేస్ చేయడం కష్టం అవుతుంది. కుకీలను బ్లాక్ చేయాలి. ప్రతీ దానికి ఒకే మెయిల్ వాడకూడదు. పాస్‌వర్డ్‌లను మారుస్తూ ఉండాలి.
News December 4, 2025
160 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

భోపాల్‌లోని భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (<
News December 4, 2025
సంగారెడ్డి: భారీగా రేషన్ బియ్యం పట్టివేత

మెదక్ జిల్లా తూప్రాన్‌లో అక్రమంగా తరలిస్తున్న 285.70 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నట్లు విజిలెన్స్ డీఎస్పీ రమేష్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారం నుంచి మహారాష్ట్రకు సన్న రేషన్ బియ్యము తరలిస్తున్నారు. నమ్మదగిన సమాచారం రావడంతో తూప్రాన్ పరిధి లోని అల్లాపూర్ టోల్ ప్లాజా వద్ద గురువారం వాహన తనిఖీ చేపట్టగా రేషన్ బియ్యం లారీ పట్టుబడినట్లు తెలిపారు. విజిలెన్స్ సీఐ అజయ్ బాబు పాల్గొన్నారు.


