News February 16, 2025
చెత్త విషయంలో తల్లి, కొడుకుపై కత్తితో దాడి

గుత్తి ఆర్ఎస్‌లో చెత్త పడేసే విషయంలో ఇరువర్గాల మధ్య ఆదివారం ఘర్షణ చోటుచేసుకుంది. ఇంటిముందు చెత్త పడేశారని వంశీ, అతని తల్లి సాయమ్మపై రిజ్వానా, రసూల్ కత్తితో దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన వంశీ, సాయమ్మను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం రెఫర్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News March 28, 2025
ఎన్టీఆర్ పింఛన్లకు రూ.127.76 కోట్లు మంజూరు

అనంతపురం జిల్లాలో ఏప్రిల్ 1న పంపిణీ చేయనున్న ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్లు పంపిణీకి రూ.126.76 కోట్లు నిధులు విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 2,79,165 మంది లబ్దిదారులకు పింఛన్లు ఇంటి వద్ద పంపిణీ చేయడానికి చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. మొదటి రోజు సాంకేతిక కారణాలతో పంపిణీ జరగకుంటే రెండవ రోజు తప్పనిసరిగా ఇంటివద్ద అందిస్తారని పేర్కొన్నారు.
News March 27, 2025
లేపాక్షి: పరీక్షలు సరిగా రాయలేదనే భయంతో..

లేపాక్షి మండలం పులమతి సడ్లపల్లికి చెందిన బాబు అనే విద్యార్థి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాబు పదో తరగతి పరీక్షలు సరిగా రాయలేదని, పరీక్షల్లో ఫెయిల్ అయితే ఇంట్లో ఇబ్బంది కలుగుతుందనే భయంతో గురువారం మధ్యాహ్నం ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. చుట్టుపక్కల వారు బాబును హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
News March 27, 2025
భగభాన్ పాలైకి 10ఏళ్ల జైలు శిక్ష విధించిన గుంతకల్ కోర్టు

ఒడిశా రాష్ట్రానికి చెందిన భగభాన్ పాలై అనే వ్యక్తికి గుంతకల్ కోర్టు 10ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2023లో గుంతకల్లు రైల్వే స్టేషన్‌లో గంజాయి తరలిస్తూ రైల్వే పోలీసులకు నిందితుడు పట్టుబడ్డాడు. అతడి వద్ద నుంచి 32 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. బుధవారం కోర్టులో హాజరుపరచగా ముద్దాయికి 10ఏళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.