News October 9, 2024
చెన్నారావుపేట: గ్రామంలో ఎనిమిది మందికి టీచర్ ఉద్యోగాలు

డీఎస్సీ ఫలితాల్లో వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లికి చెందిన యువత సత్తా చాటారు. ఒకేసారి గ్రామంలోని ఎనిమిది మంది డీఎస్సీలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించారు. ఇందులో మేరు హరికృష్ణ గౌడ్, కొన్ రెడ్డి సమతా, బొమ్మెర సతీశ్, పల్లకొండ శిల్ప, శృతి, పులుచేరు మహేశ్, సంగెం సాత్విక్, బోడ దివ్య ఉన్నారు. వీరంతా ఎస్‌జీటీలే కావడం విశేషం. వీరిని పలువురు అభినందించారు.
Similar News
News December 7, 2025
WGL: పంచాయతీ ఎన్నికల సమాచారం లోపం.. మీడియాకు ఇబ్బందులు!

జిల్లాలో GP ఎన్నికల వివరాలు పత్రికలు, మీడియాకు చేరవేయడంలో యంత్రాంగం ఘోరంగా విఫలమైందని విమర్శలు వినిపిస్తున్నాయి. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలైనా, అర్ధరాత్రి వివరాలు ఇస్తామని DPO చెప్పగా, సమాచార శాఖ పాత డేటానే పంపడంతో తాజా సమాచారం మాయం అయింది. గతంలో 50 మండలాల డేటాను సమయానికి అందించిన యంత్రాంగం, ఇప్పుడు 11 మండలాల వివరాలకే తంటాలు పడుతోంది. వాట్సాప్కే పరిమితమైన సమాచార పంపిణీతో ఇబ్బందవుతోంది.
News December 7, 2025
మూడు విడతలు పూర్తయ్యే వరకు కోడ్ అమలు: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతలు ముగిసే వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని గఎన్నికల అధికారి, కలెక్టర్ సత్య శారద తెలిపారు. ఈ నెల 11, 14, 17 తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నందున, చివరి దశ పూర్తయ్యే వరకు కోడ్ కొనసాగుతుందన్నారు. ఏకగ్రీవ పంచాయతీలకు కూడా కోడ్ వర్తిస్తుందని, ఉల్లంఘనలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News December 5, 2025
ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి: రాణి కుముదిని

సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులు, పోలీస్ అధికారులతో ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో నర్సంపేట ఆర్డీవో కార్యాలయం నుంచి కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొన్నారు.


