News March 20, 2025

చెన్నారావుపేట: రెండు రోజుల్లో టెన్త్ పరీక్షలు.. విద్యార్థి మృతి

image

మరో రెండు రోజుల్లో వార్షిక పరీక్షలకు వెళ్లాల్సిన పదో తరగతి విద్యార్ధి గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందిన విషాద ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జల్లిలో చోటుచేసుకుంది. పింగిలి అశ్వంత్ రెడ్డి నర్సంపేటలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అస్వస్థతకు గురికాగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ అశ్వంత్ బుధవారం మృతి చెందాడు. కొడుకు మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

Similar News

News March 20, 2025

వరంగల్: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి జరిమానా

image

వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వారిని కోర్టులో హాజరు పరిచారు. 21 మందిని వరంగల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ అబ్బోజు వెంకటేశం ముందు హాజరు పరచగా.. వారికి రూ.20,600 జరిమానా విధించారు. అలాగే లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన మరో నలుగురికి రెండు వేల జరిమానా విధించినట్లు సీఐ రామకృష్ణ తెలిపారు.

News March 20, 2025

మహిళ సాధికారతకు ప్రభుత్వ కృషి: మంత్రి

image

మహిళ సాధికారతకు ప్రభుత్వ కృషి చేస్తుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని దేశాయిపేట దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌ను ప్రారంభించారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక పురోగతికి అనేక రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను తీసుకురావడం జరిగిందన్నారు.

News March 20, 2025

భద్రకాళి చెరువు పూడికతీత పనులు పూర్తి కావాలి: మంత్రి

image

వానకాలం సీజన్ రాకముందు భద్రకాళి చెరువు పూడిక తీత పనులు పూర్తి కావాలని మంత్రి కొండ సురేఖ అన్నారు. భద్రకాళి చెరువు పూడికతీత పనులను మేయర్, ఎమ్మెల్యే, కుడా ఛైర్మన్, కలెక్టర్లతో కలిసి పరిశీలించారు. ప్రతిరోజు చెరువు పూడికతీత పనులు కొనసాగుతున్నాయని, సోమవారం నుండి విద్యుత్ లైట్లను తగినంత సిబ్బందిని ఏర్పాటు చేసి, రాత్రి వేళల్లో కూడా మట్టి తరలింపు చేస్తామని కలెక్టర్ ప్రావీణ్య మంత్రికి వివరించారు.

error: Content is protected !!