News March 20, 2025

చెన్నారావుపేట: రెండు రోజుల్లో టెన్త్ పరీక్షలు.. విద్యార్థి మృతి

image

మరో రెండు రోజుల్లో వార్షిక పరీక్షలకు వెళ్లాల్సిన పదో తరగతి విద్యార్ధి గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందిన విషాద ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జల్లిలో చోటుచేసుకుంది. పింగిలి అశ్వంత్ రెడ్డి నర్సంపేటలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అస్వస్థతకు గురికాగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ అశ్వంత్ బుధవారం మృతి చెందాడు. కొడుకు మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

Similar News

News December 19, 2025

రోజూ గుడ్లు పెట్టే కోళ్ల గురించి తెలుసా?

image

పౌల్ట్రీ పరిశ్రమలో అధిక గుడ్ల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందాయి BV 380 రకం కోళ్లు. ఇవి వేడి, తేమ వాతావరణాలకు అనుకూలంగా ఉంటాయి. సంవత్సరానికి 308 గుడ్లు పెట్టడం ఈ కోళ్ల ప్రత్యేకత. BV 380 కోడి పిల్లలను 18 నుంచి 20 వారాల పాటు పెంచిన తర్వాత గుడ్లను పెట్టడం ప్రారంభిస్తాయి. గోధుమ రంగులో ఉండే ఈ గుడ్లు పెద్దగా ఉంటాయి. ఇవి ఏడాది పాటు గుడ్లు పెట్టి తర్వాత ఆపేస్తాయి. అప్పుడు వాటిని మాంసం కోసం విక్రయించవచ్చు.

News December 19, 2025

మరికల్: ఒకే పంచాయతీకి ఉపసర్పంచులుగా నాడు భర్త.. నేడు భార్య

image

మరికల్ మండలం గాజులయ్యతండాకు చెందిన దంపతులు అరుదైన గుర్తింపు పొందారు. 2019లో బుడ్డగానితండా నూతన పంచాయతీగా ఏర్పడగా.. భాస్కర్‌ నాయక్ వార్డు సభ్యుడిగా గెలిచి, తొలి ఉపసర్పంచ్‌గా పనిచేశారు. తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆయన భార్య జమున గాజులయ్యతండా నుంచి వార్డు సభ్యురాలిగా ఏకగ్రీవమై, అనంతరం బుడ్డగానితండా ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యారు. దీంతో ఒకే పదవిని భార్యాభర్తలు అలంకరించడం విశేషం.

News December 19, 2025

సర్పంచ్ అభ్యర్థికి ఒక్క ఓటూ పడలేదు!

image

TG: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఘటన జరిగింది. సర్పంచ్ బరిలో నిలిచిన ఓ అభ్యర్థికి ఒక్క ఓటూ రాలేదు. వరంగల్(D) ఖానాపురం(M) కీర్యాతండాలో ఈ నెల 17న సర్పంచ్ ఎన్నికల పోలింగ్ జరిగింది. మొత్తం 239 ఓట్లు పోలవగా BJP బలపరిచిన బోడ గౌతమికి కనీసం ఒక్క ఓటు కూడా పడలేదు. చివరికి నోటాకు ఒక ఓటు పోలైంది. దీంతో ఆమె తనకు తానూ ఓటు వేసుకోలేదా? అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడ INC అభ్యర్థి విజయ గెలిచారు.