News March 20, 2025
చెన్నారావుపేట: రెండు రోజుల్లో టెన్త్ పరీక్షలు.. విద్యార్థి మృతి

మరో రెండు రోజుల్లో వార్షిక పరీక్షలకు వెళ్లాల్సిన పదో తరగతి విద్యార్ధి గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందిన విషాద ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జల్లిలో చోటుచేసుకుంది. పింగిలి అశ్వంత్ రెడ్డి నర్సంపేటలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అస్వస్థతకు గురికాగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ అశ్వంత్ బుధవారం మృతి చెందాడు. కొడుకు మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
Similar News
News March 21, 2025
పార్వతీపురం: బావిలో మృత్యదేహం .. UPDATE

పార్వతీపురం నుంచి బొబ్బిలి వెళ్లే దారిలో నర్సిపురం బావిలో సత్యనారాయణ మృతదేహాం కనిపించిన విషయం తెలిసిందే. అయితే సారక వీధికి చెందిన అతను రెండు రోజుల నుంచి కనిపించలేదని గురువారం మృతదేహమై కనిపించాడని కుటుంబీకులు తెలిపారు. మృతుని భార్య పార్వతీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశామన్నారు. అతనికి ఇద్దరు పిల్లలున్నారు.
News March 21, 2025
సరికొత్త వివాదంలో OLA!

విద్యుత్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఓలా కొత్త వివాదంలో చిక్కుకుంది. ఓలా వెల్లడించిన వాహన విక్రయాల సంఖ్య, వాహన రిజిస్ట్రేషన్ల సంఖ్యకు సరిపోలడం లేదని కేంద్రం గుర్తించింది. దీనిపై దర్యాప్తు చేయాలని ARAIని ఆదేశించింది. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని చెప్పినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కాగా FEBలో 25వేల వాహనాలు అమ్మినట్లు OLA పేర్కొనగా వాహన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య 8,652గా ఉండటం గమనార్హం.
News March 21, 2025
MBNR: చెట్టుపై నుంచి కిందపడి వ్యక్తి మృతి

ఈనెల 15న చెట్టు ఎక్కి ఆకులు తెంచుతుండగా.. కాలు జారికిందపడి గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన బుధవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు వివరాలు.. అడ్డాకుల మం. పొన్నకల్కు చెందిన సత్యం(30) గ్రామ సమీపంలోని చెట్టు ఎక్కి కిందపడ్డారు. ఆయనను కుటుంబసభ్యులు HYDలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.