News April 10, 2024

చెన్నారావుపేట: వడదెబ్బతో రైతు మృతి

image

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ముగ్ధుంపురంలో విషాదం జరిగింది. ముగ్ధుంపురంకు చెందిన బాదవత్ మోహన్(56) వడదెబ్బతో మృతి చెందాడు. మోహన్ తన మొక్కజొన్న చేను వద్దకు రెండు రోజులు కాపలాకు వెళ్లడంతో ఎండ వేడిమికి వడదెబ్బ తాకింది. మంగళవారం అస్వస్థతకు గురయ్యాడు. స్థానికంగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మోహన్ మృతదేహానికి ఎంపీటీసీ చీకటి స్వరూప ఓదెలు, చెన్నారావుపేట సొసైటీ డైరెక్టర్ గోపి తదితరులున్నారు.

Similar News

News April 10, 2026

వరంగల్: అంగన్వాడీల్లో ‘తొలిముద్ద’తో పోషకాహారం

image

జిల్లాలో అంగన్వాడీ చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ‘తొలిముద్ద’ పథకాన్ని ప్రారంభించింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, జిల్లా వ్యాప్తంగా 919 కేంద్రాల్లో అమలు చేస్తున్నారు. గర్భిణులు, బాలింతలు, 47,548 మంది చిన్నారులకు బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు పౌష్టికాహారం అందించనున్నారు. ఉదయం అల్పాహారం లేక ఇబ్బంది పడుతున్న చిన్నారులకు ఈ పథకం ఉపశమనంగా మారనుంది.

News April 9, 2026

వరంగల్: యువతి అనుమానస్పద మృతి..!

image

వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని ఓ తండాలో అనుమానస్పదంగా యువతి మృతి చెందింది. తండాకు చెందిన ఓ యువతి ఉరి వేసుకొని ఇంట్లో కనిపించింది. ప్రేమ పేరుతో పర్వతగిరి మండలం రావూరు తండాకు చెందిన నలుగురు యువకులు వేధించి రేప్ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా పోలీసులు అనుమానాస్పదంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

News April 9, 2026

ఎయిడ్స్‌పై అవగాహన కల్పించాలి: వరంగల్ కలెక్టర్

image

ఎయిడ్స్‌పై సమాజంలో సరైన అవగాహన కల్పించడం అత్యంత కీలకమని కలెక్టర్ డా.సత్యశారద తెలిపారు. ప్రజాపాలన-పట్టణ ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా బుధవారం KMC నుంచి MGM వరకు నిర్వహించిన “AIDS Awareness & Prevention Campaign Day” ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ అనంతరం ఎంజీఎం కూడలిలో నిర్వహించిన మానవహారంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.