News March 6, 2026

చెన్నూరు: ఉపాధ్యాయుడిగా మారిన జిల్లా కలెక్టర్

image

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. చెన్నూరు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి 9వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించి వారి అభ్యాసన సామర్ధ్యాలను పరిశీలించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. నేను ప్రకారం విద్యార్థులకు సకాలంలో పోస్ట్కాహారం అందించాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News April 13, 2026

HYD: కన్నీటి కడలిలో ఎదురీదిన సృజన

image

రాజేంద్రనగర్ మండలం పద్మశాలిపురం బస్తీకి చెందిన గుంటి సృజన కష్టాల మధ్య అద్భుతం చేసి చూపింది. క్యాన్సర్‌తో బాధపడుతున్న తండ్రిని ఆస్పత్రిలో చూసుకుంటూనే ఇంటర్ పరీక్షలకు హాజరైంది. కుటుంబం ఆర్థికంగా బలహీనంగా ఉన్నా ఆమె ధైర్యం కోల్పోలేదు. బైపీసీలో 440 మార్కులకు 427 మార్కులు సాధించి తండ్రి ముఖంలో వెలుగు నింపాలనుకుంది. కానీ ఈ లోపే తండ్రి కాలంచేయడంతో మార్కులు చూసుకుంటూ తండ్రిని తలచుకుని కన్నీరు పెట్టుకుంది.

News April 13, 2026

అనకాపల్లి: ఉపాధి హామీ పని చేస్తుండగా గుండెపోటు.. కూలీ మృతి

image

ఉపాధి హామీ పని చేస్తు వేతనదారుడు మృతి చెందిన ఘటన అనకాపల్లిలో జరిగింది. మునగపాక మండలం చూచుకొండలోని శాంతినగర్ కాలనీకి చెందిన బీరా రాము (67) సోమవారం ఉపాధి హామీ పనులకు వెళ్లారు. ఏనుగు కొండ సమీపంలో తోటి వేతనదారులతో కలిసి పని చేస్తుండగా ఆయనకు గుండెపోటు వచ్చి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News April 13, 2026

HYD: IPL మ్యాచ్..ట్రాఫిక్ డైవర్షన్ రూట్లు ఇవే..!

image

✓ఘట్కేసర్- చెంగిచెర్ల- బోడుప్పల్- పిర్జాదిగూడ- ఉప్పల్ HMDA భగాయత్- నాగోల్-ఎల్బీనగర్
✓తార్నాక నుంచి ఎల్బీనగర్, ఘట్కేసర్ వెళ్లే వాహనాలు హబ్సిగూడ క్రాస్ రోడ్డు నుంచి నాచారం NFC సర్కిల్, IOCL చర్లపల్లి, చెంగిచెర్ల, బోడుప్పల్, నాగోల్, ఎల్బీనగర్
✓ఎల్బీనగర్ నుంచి ఘట్కేసర్ వెళ్లే వాహనాలు నాగోల్ మెట్రో యూటర్న్, HMDA భగాయత్, టయోటా యూటర్న్, బోడుప్పల్, ఘట్కేసర్.