News April 10, 2025
చెన్నూరు: నాణ్యమైన ధాన్యం కొనాలి: అదనపు కలెక్టర్

రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వరి ధాన్యం కొనాలని అదనపు కలెక్టర్ సభావత్ మోతిలాల్ అన్నారు. చెన్నూరులో సంబంధిత అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వహకులతో సమీక్ష నిర్వహించారు. నిబంధనల ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. కేంద్రాల్లో తాగునీరు, నీడ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సౌకర్యాలు కల్పించాలన్నారు.
Similar News
News December 13, 2025
పడమర దిక్కులో బోరు బావి ఉండవచ్చా?

సాధారణంగా ఇంటికి అవసరమయ్యే నీటి వనరులు ఈశాన్యం/ ఉత్తర దిక్కులలో ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. అయినప్పటికీ పడమర దిక్కులో బోరు వేయడం వలన నీటి అవసరం తీరుతుంది కాబట్టి ఇది వాస్తు పరంగా ఆమోదయోగ్యమే అని అంటున్నారు. ‘నీరు అనేది ప్రాథమిక అవసరం కాబట్టి, దానిని మంచి స్థలంలో నిల్వ చేసుకున్నా, నిత్యం అందుబాటులోకి తెచ్చినా తప్పేం ఉండదు. దీని వలన మంచి ఫలితాలు పొందవచ్చు’ అంటున్నారు.<<-se>>#Vasthu<<>>
News December 13, 2025
15న జరగాల్సిన PGRS కార్యక్రమం రద్దు: ఇలక్కియా

భవానీ దీక్షల విరమణ విధుల్లో జిల్లా అధికారులు నిమగ్నమై ఉన్నందున ఈ నెల 15న జరగాల్సిన జిల్లాస్థాయి PGRS కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఇలక్కియా తెలిపారు. తదుపరి సోమవారం నుంచి PGRS యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు తమ అర్జీలను Meekosam.ap.gov.inలో నమోదు చేసుకోవచ్చని, వివరాల కోసం 1100కు కాల్ చేయవచ్చని పేర్కొన్నారు.
News December 13, 2025
లోక్ అదాలత్లో 19,577 కేసులు పరిష్కారం

జాతీయ లోక్అదాలత్లో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మొత్తం 19,577 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్తి తెలిపారు. జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో 28 బెంచీల ద్వారా 284 సివిల్, 19,096 క్రిమినల్, 197 మోటార్ యాక్సిడెంట్ కేసులను పరిష్కరించారు. మోటార్ ప్రమాదాలకు సంబంధించిన కేసుల్లో బాధితులకు రూ. 6.34 కోట్ల నష్టపరిహారం చెల్లించినట్లు ఆయన వివరించారు.


