News April 10, 2025

చెన్నూరు: నాణ్యమైన ధాన్యం కొనాలి: అదనపు కలెక్టర్

image

రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వరి ధాన్యం కొనాలని అదనపు కలెక్టర్ సభావత్ మోతిలాల్ అన్నారు. చెన్నూరులో సంబంధిత అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వహకులతో సమీక్ష నిర్వహించారు. నిబంధనల ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు.  కేంద్రాల్లో తాగునీరు, నీడ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సౌకర్యాలు కల్పించాలన్నారు.

Similar News

News April 25, 2025

రావికమతం: జాతీయస్థాయి బోసి పోటీలకు ఎంపికైన బాల సరస్వతి

image

రావికమతం మం. కేబీపీ అగ్రహారానికి చెందిన దివ్యాంగురాలు నక్కరాజు బాల సరస్వతి జాతీయస్థాయి బోసి పోటీలకు ఎంపికైందని ఉపాధ్యాయుడు బొడ్డు మహాలక్ష్మి నాయుడు గురువారం తెలిపారు. రాష్ట్ర సమగ్ర శిక్ష, స్పెషల్ ఒలంపిక్ భారత క్రీడా సంస్థ సంయుక్తంగా విజయవాడలో నిర్వహించిన దివ్యాంగుల ఆటల పోటీల్లో బాల సరస్వతి ఉత్తమ ప్రతిభ కనబరిచిందన్నారు. దీంతో చత్తీస్‌గడ్‌లో నిర్వహించనున్న పోటీలకు ఆమెను ఎంపిక చేశారని వెల్లడించారు.

News April 25, 2025

పంచాయతీరాజ్ పాత్ర కీలకమైంది: కర్నూలు కలెక్టర్

image

గ్రామీణాభివృద్ధి, స్థానిక పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు. గురువారం కర్నూలు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ షెడ్యూల్లో 243 ఆర్టికల్ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను రూపొందిస్తూ చట్టం చేశారన్నారు.

News April 25, 2025

అమరచింత: విషపూరితమైన ద్రవం తాగి చిన్నారి మృతి

image

అమరచింత మున్సిపాలిటీలోని 9వ వార్డులో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. కాలనీకి చెందిన వంశీ, గాయత్రిలకు ఆర్థిక (18నెలలు), మణికంఠలు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటూ ఆర్థిక ఓ బాటిల్‌లో ఉన్న ద్రవాన్ని తాగింది. దీంతో చిన్నారి ఆర్థిక మృతి చెందింది. మణికంఠ కళ్లమీద ద్రవం పడటంతో బొబ్బలు వచ్చాయి. మణికంఠను జిల్లా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!