News June 23, 2024

చెన్నూరు: బీమా సొమ్ము కోసం బామ్మర్దిని చంపిన బావ

image

బీమా సొమ్ము కోసం బామ్మర్దిని బావ హత్య చేసిన ఘటన చెన్నూరులో జరిగింది. కనుపర్తి చెందిన నారాయణరెడ్డి పేరున చెన్నూరుకు చెందిన అతని సోదరి భర్త బాల గురుప్రసాద్‌రెడ్డి రూ.12.5 లక్షలకు 2 బీమా పాలసీలు చేయించారు. నామినీగా అతని సోదరి పేరు నమోదు చేయించారు. బీమా సొమ్ము కోసం 18న చెన్నూరు శివారులో మద్యం మత్తులో ఉన్న నారాయణరెడ్డిని అతని బావ తలపై దిమ్మెతో కొట్టి హతమార్చినట్లు సీఐ శంకర్ నాయక్ తెలిపారు.

Similar News

News October 24, 2025

కడప: స్కూళ్లకు సెలవులపై DEO కీలక ప్రకటన

image

కడప జిల్లాలో భారీ వర్షాలు కురుస్తూ వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో DEO షంషుద్దీన్ కీలక ప్రకటన విడుదల చేశారు. వర్షాల కారణంగా స్కూళ్లను నిర్వహించలేని పరిస్థితులు ఉంటే అక్కడి హెచ్ఎంలు, ఎంఈఓలు డిప్యూటీ DEOల అనుమతితో సెలవు ప్రకటించుకోవచ్చని తెలిపారు.

News October 24, 2025

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కడప JC

image

కడపలో తుఫాన్, భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ అదితి సింగ్ ఆదేశించారు. గురువారం టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లా, మండల స్థాయి అధికారులతో పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. చెరువులు, వాగులు, వంకల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల కోసం కంట్రోల్ రూమ్ నంబర్ 08562-246344 ఏర్పాటు చేసినట్లు తెలిపారు.