News November 18, 2024

చెన్నూరు: ‘బొగ్గు వేలం రద్దుచేసి సింగరేణికే కేటాయించాలి’

image

బొగ్గు బ్లాక్‌ల వేలం పాట రద్దు చేసి సింగరేణి సంస్థకే బ్లాక్‌లను కేటాయించాలని చెన్నూరులో CPMఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఏరియా కార్యదర్శి చందు, జిల్లా నాయకురాలు రాజేశ్వరి మాట్లాడుతూ..మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన BJPప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో ఉన్న బొగ్గు పరిశ్రమను ప్రైవేటు కార్పోరేట్ సంస్థలకు ఇవ్వడం కోసం బొగ్గు బ్లాక్‌ల వేలం నిర్వహిస్తోందన్నారు.

Similar News

News November 18, 2024

ఉట్నూర్, నార్నూర్ మధ్యలో రోడ్డుపై కనిపించిన పెద్దపులి

image

ఉట్నూర్‌లో కొన్ని రోజులుగా పెద్దపులి సంచరిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆదివారం రాత్రి ఉట్నూర్, నార్నూర్ మధ్యలో పెద్దపులి రోడ్డు దాటుతూ వాహనదారులకు కనిపించింది. ఒక్కసారిగా రోడ్డుపై పెద్దపులి రావడంతో వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో కొంతమంది దాన్ని తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. అయితే ఇప్పటికే పలు మండలాల ప్రజలను అటవీ అధికారులు అప్రమత్తం చేశారు.

News November 18, 2024

బెల్లంపల్లి: ప్రభుత్వ కొలువులు సాధించి ఆదర్శంగా నిలుస్తున్న అన్నదమ్ములు

image

చిన్నతనంలోనే తండ్రి చనిపోగా తల్లి రెక్కలు ముక్కలు చేసుకుని చదివించింది. తల్లి కష్టానికి ప్రతిఫలంగా ఇద్దరు కుమారులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఆదర్శంగా నిలిచారు. బెల్లంపల్లి మండలం చిన్న బూదలోని రవీంద్రనగర్‌కు చెందిన మిట్టపల్లి రవికుమార్, శ్రీధర్ అన్నదమ్ములు. వీరిలో రవికుమార్ ఇప్పటికే రైల్వేలో ఉద్యోగం చేస్తుండగా, శ్రీధర్ ఇటీవల గ్రూప్- 4లో మంచిర్యాల కలెక్టరేట్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా జాబ్ సాధించాడు.

News November 17, 2024

బీర్సాయిపేట్: ‘రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలి’

image

ఉట్నూరు మండలంలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో బీర్సాయిపేట్, పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీర్సాయిపేట్ అటవీశాఖ అధికారులు కోరారు. ఆదివారం వారు మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాలలో పెద్దపులి సంచార సమాచారం ఉందన్నారు. బీర్సాయిపేట్, పరిసర గ్రామాలతో పాటు నార్నూర్,జైనూరు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే పులికి ఏ హాని తలపెట్టవద్దని, నష్టం జరిగితే అటవీశాఖ నష్టపరిహారం ఇస్తుందన్నారు.