News August 15, 2024
చెన్నూరు: శతాధిక సమరయోధుడు బాల ఎల్లారెడ్డి

స్వాతంత్ర్య ఉద్యమాల్లో పాల్గొని జైలు జీవితం అనుభవించిన సమరయోధులలో బాల ఎల్లారెడ్డి(103) ఒకరు. చెన్నూరుకు చెందిన ఆయన 1921 జనవరిలో జన్మించారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా బాలయల్లారెడ్డి కొండపేట వంతెనను కూల్చేశారు. జిల్లాలో 15 మంది స్వాతంత్ర సమరయోధులు జైలు జీవితాలు గడపగా వారిలో ఇప్పటికే 14 మంది మృతిచెందారు. శతాధిక వయసులో ఉన్న బాల ఎల్లారెడ్డి ప్రస్తుతం చెన్నూరులో జీవిస్తున్నారు.
Similar News
News November 17, 2025
కడప: ‘మహిళలు ఉపాధి శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి’

కడపలోని కెనరా బ్యాంక్ శిక్షణ శిబిరం నందు నిర్వహించే శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి అని సంస్థ డైరెక్టర్ ఆరిఫ్ పేర్కొన్నారు. నవంబర్ 17వ తేదీ నుంచి 45 రోజుల పాటు మహిళలకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు వెల్లడించారు. టైలరింగ్, బ్యూటీ పార్లర్ విభాగాలలో శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఉచిత వసతి సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు.
News November 16, 2025
కడపలో రైలు ఢీకొని విద్యార్థి మృతి

కడప రైల్వే స్టేషన్లో శనివారం గూడ్స్ రైలు ఢీకొని సతీశ్ (24) అనే బీటెక్ విద్యార్థి మృతి చెందినట్లు కడప రైల్వే SI సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. సతీశ్ పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు వచ్చి ఢీకొట్టడంతో ప్రమాదవశాత్తూ మృతి చెందాడన్నారు. మృతుడు నంద్యాల జిల్లా బనగానపల్లె వాసి అని, కడపలో అన్నమాచార్య కాలేజీలో బీటెక్ చదువుతున్నాడని వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు SI పేర్కొన్నారు.
News November 16, 2025
కడప జిల్లాలో పలువురు సీఐల బదిలీలు.!

కడప జిల్లాలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ DIG కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. పోరుమామిళ్ల CI శ్రీనివాసులను రైల్వే కోడూరుకు, రైల్వే కోడూరు CI హేమసుందర్ రావును పోరుమామిళ్లకు బదిలీ చేశారు. ఒంటిమిట్ట CI బాబును అన్నమయ్య జిల్లాకు, చిత్తూరు VRలో ఉన్న నరసింహరాజు ఒంటిమిట్టకు బదిలీ అయ్యారు. ట్రాఫిక్ CI జావేద్ కడప జిల్లా సైబర్ క్రైమ్ సీఐగా బదిలీ కాగా.. ఆయన స్థానంలో సురేశ్ రెడ్డి రానున్నారు.


