News August 15, 2024

చెన్నూరు: శతాధిక సమరయోధుడు బాల ఎల్లారెడ్డి

image

స్వాతంత్ర్య ఉద్యమాల్లో పాల్గొని జైలు జీవితం అనుభవించిన సమరయోధులలో బాల ఎల్లారెడ్డి(103) ఒకరు. చెన్నూరుకు చెందిన ఆయన 1921 జనవరిలో జన్మించారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా బాలయల్లారెడ్డి కొండపేట వంతెనను కూల్చేశారు. జిల్లాలో 15 మంది స్వాతంత్ర సమరయోధులు జైలు జీవితాలు గడపగా వారిలో ఇప్పటికే 14 మంది మృతిచెందారు. శతాధిక వయసులో ఉన్న బాల ఎల్లారెడ్డి ప్రస్తుతం చెన్నూరులో జీవిస్తున్నారు.

Similar News

News September 11, 2024

రాష్ట్రస్థాయి పోటీలకు వల్లూరు విద్యార్థినులు

image

వల్లూరు ఏపీ మోడల్ స్కూల్ కం జూనియర్ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినిలు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ సురేశ్ బాబు తెలిపారు. ఎస్జీఎఫ్ అండర్-19 జిల్లా స్థాయి పోటీల్లో భాగంగా పులివెందులలో మంగళవారం నిర్వహించిన బాలికల విభాగం ఖోఖో పోటీల్లో కళాశాలకు చెందిన ఇంటర్ సెకండీయర్ ఎంపీసీ విద్యార్థిని మమత, ఇంటర్ సెకండీయర్ బైపీసీ విద్యార్థిని ముబీన ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

News September 10, 2024

రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్‌కు ఎంపికైన IIIT విద్యార్థులు

image

కోనసీమలో ఈ నెల 14,15వ తేదీలలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు కడప జిల్లా తరఫున ఇడుపులపాయ IIIT విద్యార్థులు ఎంపికయ్యారు. మొత్తం 7 మంది అమ్మాయిలు, 5 మంది అబ్బాయిలు ఎంపికైన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వారిని ట్రిపుల్ఐటీ సంచాలకులు డా. కుమారస్వామి గుప్తా అభినందించారు. కార్యక్రమంలో పవర్ లిఫ్టింగ్ కోచ్ డా.బాల్ గోవింద్ తివారి తదితరులు పాల్గొన్నారు.

News September 10, 2024

YVUలో బీకాం ఆనర్స్ కోర్సు ప్రారంభం

image

కామర్స్ కోర్సు చదివిన వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని, అయితే ప్రభావంతంగా కోర్సు పూర్తి చేయాలని యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె. కృష్ణారెడ్డి తెలిపారు. బీకాం ఆనర్స్ కోర్సును ఆచార్య కె.కృష్ణారెడ్డి, కులసచివులు ఆచార్య ఎస్.రఘునాథ్‌రెడ్డితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. సమావేశంలో వైస్ ప్రిన్సిపల్ ఆచార్య పద్మ, విభాగ అధిపతి ఆచార్య విజయభారతి పాల్గొన్నారు.