News November 10, 2024

చెన్నూర్‌లో వ్యక్తి దారుణ హత్య

image

ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటన చెన్నూర్‌లో జరిగింది. CI రవీందర్ వివరాలు.. ముత్తరావుపల్లికి చెందిన రాజశేఖర్ అదే గ్రామానికి చెందిన భూమయ్య భార్య సౌందర్యతో వివాహేతర సంబంధం పెట్టుకొని ఆమెతో పాటు ఊరు నుంచి పారిపోయాడు. ఆమె భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. భర్తతో ఉండేందుకు ఆమె నిరాకరించింది. దీంతో రాజశేఖర్ పై కక్ష పెంచుకున్న భూమయ్య శనివారం అతడి తండ్రి మల్లయ్యను గొడ్డలితో నరికి చంపాడు.

Similar News

News December 11, 2024

మంచిర్యాల: కుటుంబంలో ముగ్గురు మృతి

image

కుటుంబం మొత్తం ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటనలో చికిత్స పొందుతున్న ముగ్గురు బుధవారం ఉదయం మృతి చెందారు. తాండూరు మండలం కాసిపేటకు చెందిన మొండయ్య కుటుంబీకులు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మొండయ్య, అతడి కుమార్తె చైతన్య(30) ఇవాళ ఉదయం మృతి చెందగా.. కొద్దిసేపటి క్రితమే అతడి భార్య శ్రీదేవి కూడా మృతి చెందింది. కుమారుడు శివప్రసాద్(26) పరిస్థితి విషమంగా ఉంది.

News December 11, 2024

మంచిర్యాల: చికిత్స పొందుతున్న తండ్రి, కుమార్తె మృతి

image

మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. తాండూరు మండలం కాసిపేట గ్రామానికి చెందిన ఓ కుటుంబం మంగళవారం పురుగు మందు తాగి <<14839477>>ఆత్మహత్యాయత్నం<<>> చేసుకున్నారు. జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మొండయ్య(60), అతడి కుమార్తె చైతన్య(30) మృతి చెందారు. భార్య శ్రీదేవి(50), కుమారుడు శివ ప్రసాద్(26) పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

News December 11, 2024

MNCL: పోలింగ్ కేంద్రాల ఏర్పాటులో అభ్యంతరాలు తెలపాలి: కలెక్టర్

image

పంచాయతీ ఎన్నికలలో భాగంగా జిల్లాలో గుర్తించిన పోలింగ్ కేంద్రాల ఏర్పాటులో ఏమైనా అభ్యంతరాలు ఉంటేలిఖితపూర్వకంగా తెలపాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం మంచిర్యాల కలెక్టరేట్ కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలోని 311 గ్రామ పంచాయతీలలో ఎన్నికల నిర్వహణకు 2, 2,730 కేంద్రాలను గుర్తించినట్లు పేర్కొన్నారు.