News January 30, 2025
చెన్నూర్: గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో విషాదం చోటుచేసుకుంది. పట్టణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న టీజీఎస్పీ హెడ్ కానిస్టేబుల్ సాలిగంటి లచ్చయ్య గుండెపోటుతో మృతి చెందారు. పోలీస్ స్టేషన్లో హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోవడంతో తోటి సిబ్బంది హుటాహుటిన మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు.
Similar News
News October 19, 2025
పార్వతీపురం మన్యం జిల్లాలో రేపు PGRS రద్దు

ప్రతి సోమవారం కలెక్టరెట్లో నిర్వహించే PGRS కార్యక్రమం ఈనెల 20న (సోమవారం) దీపావళి పండగ సందర్భంగా రద్దు చేసినట్లు పార్వతీపురం మన్యం కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి ప్రకటించారు. ఆపై సోమవారం నుంచి PGRS యధావిధిగా జరుగుతుందని తెలిపారు. ఈవారం PGRS రద్దు విషయాన్ని అర్జీదారులు గమనించాలని విజ్ఞప్తి చేశారు.
News October 19, 2025
కృష్ణ చెక్‌పోస్ట్‌పై ఏసీబీ దాడులు.. UPDATE

NRPT జిల్లా రాష్ట్ర సరిహద్దులోని కృష్ణ ఆర్టీవో చెక్‌పోస్ట్‌పై ACB అధికారులు మధ్య రాత్రి దాడులు చేశారు. అధికారులు తనిఖీల సమయంలో కార్యాలయంలో విద్యుత్ లైట్లను ఆఫ్ చేసి, టార్చ్లైట్ల సహాయంతో సోదాలు జరిపారని సమాచారం. ఆ సమయంలో మోటార్ వెహికల్ అధికారి ప్రవీణ్ విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సోదాల్లో లెక్క చూపని నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అవినీతి ఫిర్యాదుల నేపథ్యంలో దాడులు చేసినట్లు తెలుస్తోంది.
News October 19, 2025
గద్వాల్: విజిలెన్స్ దాడులు.. రూ.2కోట్ల ధాన్యం మాయం

గద్వాలలోని శ్రీరామ రైసు మిల్లులో ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విజిలెన్స్ అధికారులు నిన్న రాత్రి వరకు నిర్వహించిన దాడులు పెను సంచలనం సృష్టించాయి. ప్రభుత్వానికి కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) కింద అందించాల్సిన రూ.2 కోట్ల విలువైన 26 వేల బస్తాల ధాన్యం మిల్లులో నిల్వ లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. ధాన్యం మాయంపై విజిలెన్స్ అధికారులు ప్రాథమిక నివేదికను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.