News January 30, 2025
చెన్నూర్: గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో విషాదం చోటుచేసుకుంది. పట్టణ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న టీజీఎస్పీ హెడ్ కానిస్టేబుల్ సాలిగంటి లచ్చయ్య గుండెపోటుతో మృతి చెందారు. పోలీస్ స్టేషన్‌లో హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోవడంతో తోటి సిబ్బంది హుటాహుటిన మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు.
Similar News
News February 18, 2025
పదో తరగతి ప్రత్యేక తరగతులను పర్యవేక్షించాలి: ADB కలెక్టర్

పదో తరగతి ప్రత్యేక తరగతులపై మండల ప్రత్యేకాధికారులు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి మండలాల వారీగా పాఠశాలలకు ప్రత్యేక అధికారులను నియమించామని పేర్కొన్నారు. విద్యార్ధులు ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు.
News February 17, 2025
బాసర పుష్కరఘాట్ వద్ద ఒకరి మృతి

నిర్మల్ జిల్లా బాసర గోదావరి నది మొదటి పుష్కర ఘాట్ వద్ద ఓ యువకుడు మృతి చెందిన ఘటన చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా ధర్మాబాద్ మండలం రత్నల్లి గ్రామానికి చెందిన పవార్ బాలాజీ అనే యువకుడు గోదావరి నదిలో స్నానం చేస్తుండగా కాలుజారి నీటిలో పడడంతో మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై గణేశ్ తెలిపారు.
News February 17, 2025
ADB: వివాహిత అదృశ్యం.. 2 టౌన్‌లో కేసు నమోదు

ఆదిలాబాద్‌లోని ఖుర్షిద్ నగర్‌కు చెందిన 32 ఏళ్ల వివాహిత అదృశ్యమైనట్లు 2 టౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపారు. సెల్ ఫోన్ విషయంలో గొడవ జరగడంతో ఈ నెల 13న ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయిందన్నారు. తిరిగి రాకపోవడంతో ఆమె భర్త ఆదివారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ వెల్లడించారు.