News January 30, 2025

చెన్నూర్: గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

image

మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో విషాదం చోటుచేసుకుంది. పట్టణ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న టీజీఎస్పీ హెడ్ కానిస్టేబుల్ సాలిగంటి లచ్చయ్య గుండెపోటుతో మృతి చెందారు. పోలీస్ స్టేషన్‌లో హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోవడంతో తోటి సిబ్బంది హుటాహుటిన మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు.

Similar News

News October 28, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* తుఫాను.. పునరావాస కేంద్రాల్లో ఒక్కో కుటుంబానికి రూ.3వేలు
* రేపు రాత్రి కాకినాడ సమీపంలో తీరం తాకనున్న ‘మొంథా’ తుఫాన్
* జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నాలుగు రోజులు ప్రచారం చేయనున్న సీఎం రేవంత్
* పత్తి తేమ 12% దాటితే మద్దతు ధర రాకపోవచ్చు: తుమ్మల
* రెండో దశలో 12 చోట్ల SIR నిర్వహణ: CEC
* కోలుకుంటున్న టీమ్‌ఇండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్

News October 28, 2025

GWL: భూ సమస్యల దరఖాస్తులు పరిష్కరించాలి

image

భూ సమస్యల దరఖాస్తులు పెండింగ్ లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని గద్వాల కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసి మందిరంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీఓ అలివేలుతో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో గద్వాల జిల్లా రాష్ట్రంలో 4వ స్థానంలో ఉందన్నారు. మిగిలిన దరఖాస్తులు వెంటనే పూర్తి చేసి రైతులకు న్యాయం చేయాలన్నారు. తహశీల్దార్లు పాల్గొన్నారు.

News October 28, 2025

లోకేశ్ ఆధ్వర్యంలో డేటా సెంటర్ అడ్వైజరీ కౌన్సిల్

image

AP: డేటా సెంటర్ అడ్వైజరీ కౌన్సిల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2030 నాటికి 6వేల MW డేటా సామర్థ్యమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కౌన్సిల్‌ను మంత్రి నారా లోకేశ్ లీడ్ చేయనున్నారు. ఇందులో Microsoft Azure, Jio Platforms వంటి అంతర్జాతీయ కంపెనీలు, IIM విశాఖ, IIT తిరుపతి సంస్థల ప్రతినిధులకు స్థానం కల్పించారు. పెట్టుబడులు, అనుమతులు, నైపుణ్యాభివృద్ధి వంటి వాటిపై కౌన్సిల్ మార్గనిర్దేశం చేయనుంది.