News January 30, 2025
చెన్నూర్: గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో విషాదం చోటుచేసుకుంది. పట్టణ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న టీజీఎస్పీ హెడ్ కానిస్టేబుల్ సాలిగంటి లచ్చయ్య గుండెపోటుతో మృతి చెందారు. పోలీస్ స్టేషన్‌లో హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోవడంతో తోటి సిబ్బంది హుటాహుటిన మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు.
Similar News
News February 7, 2025
ఆదాయం ప్రకటించిన ఎల్‌ఐసీ

LIC ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.11,506 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతంతో పోలిస్తే 17 శాతం పెరిగినట్లు పేర్కొంది. ప్రీమియంల ద్వారా రూ.1,06,891 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ త్రైమాసికంలో మెుత్తంగా సంస్థ ఆదాయం రూ.2,01,994 కోట్లు కాగా గతంతో పోలిస్తే రూ.10,453 కోట్లు తగ్గినట్లు ప్రకటించింది. ఈ నష్టాలతోLIC షేరు 2.15శాతం తగ్గి రూ.811 వద్ద ముగిసింది.
News February 7, 2025
కోటప్పకొండ జాతరకు పటిష్ట బందోబస్తు: ఎస్పీ

ఫిబ్రవరి 26న జరిగే కోటప్పకొండ తిరుణాళ్లకు ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. కొండకు వచ్చే అన్ని మార్గాలలో రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండాచర్యలు తీసుకుంటామన్నారు. పార్కింగ్ కుముందస్తు ప్రత్యేక ప్రదేశాలు ఎంపిక చేస్తామన్నారు. ప్రభలు వద్ద బందోబస్తు ఉంటుందన్నారు. పోలీస్ అధికారులున్నారు
News February 7, 2025
రేపు 11 కేంద్రాల్లో జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్

జవహర్ నవోదయ విద్యాలయంలో తొమ్మిదవ తరగతిలో ప్రవేశానికి నిర్వహించే జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్(JNVST) వరంగల్ జిల్లాలోని 11 సెంటర్లలో శనివారం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నవోదయ పరీక్ష నిర్వహిస్తున్న ఈ 11 పాఠశాలలకు జిల్లా కలెక్టర్ & డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ రేపు సెలవు ప్రకటించారు.