News January 30, 2025
చెన్నూర్: గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో విషాదం చోటుచేసుకుంది. పట్టణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న టీజీఎస్పీ హెడ్ కానిస్టేబుల్ సాలిగంటి లచ్చయ్య గుండెపోటుతో మృతి చెందారు. పోలీస్ స్టేషన్లో హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోవడంతో తోటి సిబ్బంది హుటాహుటిన మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు.
Similar News
News September 19, 2025
GDK: ‘19న జీఎం కార్యాలయాల వద్ద ధర్నాను విజయవంతం చేయండి’

2024-2025లో సింగరేణికి వచ్చిన వాస్తవ లాభాలను ప్రకటించి, 35 శాతం వాటా త్వరగా చెల్లించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం సింగరేణి జీడీకే 11వ గని, జీడీకే 1వ గని, ఏరియా వర్క్‌షాప్‌ల వద్ద గేట్ మీటింగ్‌లో వారు మాట్లాడారు. లాభాల వాటా, స్ట్రక్చర్ సమావేశాల్లో యాజమాన్యం అంగీకరించిన డిమాండ్లపై సర్క్యూలర్లు జారీ చేయాలని ఈ నెల 19న జిఎం కార్యాలయాల వద్ద ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
News September 19, 2025
జగిత్యాల: పోషణ్ పక్వాడ్ కార్యక్రమంపై శిక్షణ

జగిత్యాల జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు జగిత్యాల సీడీపీఓ మమత గురువారం పట్టణ అంగన్వాడీ టీచర్లకు ‘పోషణ్ బి పడ్డా బాయ్’ కార్యక్రమంపై అవగాహన శిక్షణ ఇచ్చారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ శిక్షణలో భాగంగా తొలిరోజు ప్రీ-స్కూల్ మెటీరియల్ తయారీపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు కవితారాణి, స్వరూప తదితరులు పాల్గొన్నారు.
News September 19, 2025
సంగారెడ్డి: ఇంటర్ విద్యార్థులు ర్యాంకులు సాధించాలి: కలెక్టర్

జిల్లాలోని ఇంటర్ విద్యార్థులు అత్యధికంగా జేఈఈ, నీట్‌లలో ర్యాంకులు సాధించేలా కృషి చేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులు, కళాశాలల ప్రిన్సిపల్స్‌తో గురువారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంటర్ తర్వాత చదివే కోర్సుల ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. సమావేశంలో అదరపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.