News January 30, 2025

చెన్నూర్: గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

image

మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో విషాదం చోటుచేసుకుంది. పట్టణ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న టీజీఎస్పీ హెడ్ కానిస్టేబుల్ సాలిగంటి లచ్చయ్య గుండెపోటుతో మృతి చెందారు. పోలీస్ స్టేషన్‌లో హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోవడంతో తోటి సిబ్బంది హుటాహుటిన మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు.

Similar News

News November 16, 2025

ibomma రవి: సీఈవో నుంచి పైరసీ దాకా..

image

పైరసీ మూవీ వెబ్‌సైట్ ibomma నిర్వాహకుడు ఇమ్మడి రవి నిన్న అరెస్టయిన విషయం తెలిసిందే. అతడు గతంలో ER ఇన్ఫోటెక్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీకి CEOగా పని చేశాడు. ఐదేళ్ల క్రితం భార్యతో విడాకులు తీసుకున్నాడని, తర్వాత పైరసీ రంగంలోకి అడుగుపెట్టాడని తెలుస్తోంది. సర్వర్లను ఈజీగా హ్యాక్ చేయగలిగేలా పట్టు సాధించాడని సమాచారం. అయితే తనను పోలీసులు పసిగట్టరనే ధీమాతో విదేశాల నుంచి కూకట్‌పల్లికి వచ్చి దొరికిపోయాడు.

News November 16, 2025

కరీంనగర్: ఈ మండలాల్లో రిపోర్టర్లు కావలెను..!

image

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి, వీణవంక, జమ్మికుంట, మానకొండూరు, తిమ్మాపూర్ మండలాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ లింకుపై <>క్లిక్<<>> చేసి వివరాలు నమోదు చేయండి.

News November 16, 2025

KMR: 3.19 మీటర్ల పైకి భూగర్భ జలాలు

image

కామారెడ్డి జిల్లాలో భూగర్భ జలాల స్థాయి గణనీయంగా పెరిగినట్లు జిల్లా భూగర్భ జల అధికారి సతీష్ తెలిపారు. గత ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే ఈ ఏడాది నీటి మట్టం ఏకంగా 3.19 మీటర్లు పెరిగిందని Way2Newsతో చెప్పారు. ఈసారి వర్షపాతం 1,402.7 మి.మీ. వర్షపాతం నమోదయ్యిందని.. ఏకంగా 58.4% అధిక వర్షపాతం పడిందన్నారు. జిల్లాలో అన్ని చెరువులు, కుంటల్లో నీళ్లు ఉండడంతో రబీ పంటలకు సాగుకు ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు.