News March 1, 2025
చెన్నూర్: పురుగు మందు తాగి యువకుడి సూసైడ్

యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన చెన్నూర్ మండలంలో జరిగింది. సీఐ రవీందర్ కథనం ప్రకారం.. నాగపూర్ గ్రామానికి చెందిన గోపి డబ్బుల విషయంలో కొమ్మెర గ్రామానికి చెందిన మధుకర్‌ను కొట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన మధుకర్ ఇంటికి వచ్చి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి శంకరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.
Similar News
News July 8, 2025
VJA: కదంభ ప్రసాదం ప్రత్యేకత ఏంటో తెలుసా?

ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ జులై 8, 9, 10 తేదీల్లో శాకంబరి అవతారంలో దర్శనమివ్వనున్నారు. ఈ ఉత్సవాల్లో అమ్మవారిని కూరగాయలు, పండ్లతో అలంకరిస్తారు. ప్రత్యేకంగా తయారుచేసే కదంభ ప్రసాదాన్ని భక్తులకు అందిస్తారు. పప్పు, బియ్యం, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలతో చేసే ఈ ప్రసాదంలో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయని ఆలయ సిబ్బంది తెలిపారు. ఈవో శీనా నాయక్ ప్రసాద పంపిణీకి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
News July 8, 2025
ప్రెస్ క్లబ్‌కు చేరుకున్న కేటీఆర్

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ నుంచి సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్‌కు చేరుకున్నారు. రైతు సంక్షేమంపై సీఎం రేవంత్‌తో చర్చించేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. సీఎం కోసం ఓ కుర్చీ కూడా వేశామని ఆయన చెప్పారు. ఆయన వస్తే చర్చించడానికి తాను సిద్ధమని స్పష్టం చేశారు. కాగా సీఎం రేవంత్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు.
News July 8, 2025
అల్లూరి జిల్లాలో తగ్గుముఖం పట్టిన వర్షాలు

అల్లూరి జిల్లాలో వర్షం తగ్గుముఖం పట్టింది. గడచిన 24గంటల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిశాయి. వరరామచంద్రపురంలో అధికంగా 22 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు మంగళవారం తెలిపారు. ముంచంగిపుట్టు 16.4, హుకుంపేట 12.4, గూడెం కొత్తవీధి 10.2, జీ.మాడుగుల 8.6, చింతపల్లి 6.8, పెదబయలు 6.2, చింతూరు 6 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయిందన్నారు. జిల్లాలో 255.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.