News March 18, 2025
చెన్నూర్: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

HNK జిల్లా హసన్పర్తిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చెన్నూర్ మండలం పొక్కురుకి చెందిన విజయ్ మృతిచెందాడు. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన విజయ్ పరకాలలో డిగ్రీ చదువుతున్నాడు. ఆదివారం రాత్రి స్నేహితులతో కలిసి బైక్పై ఎర్రగట్టు జాతరకు వెళ్లారు. ఈ క్రమంలో వీరి బైక్ను గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ఘనటలో విజయ్ స్నేహితుడు సుశాంత్ స్పాట్లోనే చనిపోగా.. MGMలో చికిత్స పొందుతూ విజయ్ సోమవారం మృతి చెందాడు.
Similar News
News October 3, 2025
గూడూరు బస్టాండ్లో దిన దిన గండం

కీలకమైన గూడూరు బస్టాండ్ ప్రయాణికుల పాలిట దిన దిన గండంగా మారింది. ప్రయాణికులు వేచి చోట ఉండే స్లాబులు పెచ్చులూడుతున్నాయి. కమ్ములు బయటపడి ఎప్పుడు ఏ పెచ్చు ఊడి పైన పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. RTC ఉన్నతాధికారులకు ఈ విషయం తెలిసిన పట్టించుకోవడం లేదు. అనుకోని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అనేది ప్రశ్నర్ధకంగా మారింది.
News October 3, 2025
మళ్లీ పెరగనున్న మొబైల్ టారిఫ్లు?

భారతీయ టెలికాం ఆపరేటర్లు ఈ ఏడాది చివరి నాటికి మొబైల్ టారిఫ్లను 10-12 శాతం వరకు పెంచే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈక్రమంలో నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఇప్పటికే 1GB ప్లాన్లను తొలగించారు. సరసమైన ప్లాన్లు కనిపించట్లేదు. డేటా ప్లాన్లను బలవంతంగా రుద్దుతున్నారు. ధరలు భారీగా పెరిగాయి. అయినా TRAI స్పందించట్లేదు’ అని నెటిజన్లు ఫైరవుతున్నారు. మీ కామెంట్?
News October 3, 2025
KNR: పెరగనున్న మహిళా ప్రాతినిధ్యం..!

స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50% రిజర్వేషన్ అమలు చేయడంతో మహిళల స్థానాలు విపరీతంగా పెరగనున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 16,42,542 మహిళా ఓటర్లుండగా.. ఇందులో 30 ZPTC స్థానాలకు, 30 MPP స్థానాలకు, 323 MPTC స్థానాలకు, 615 గ్రామపంచాయతీలకు, 6,463 వార్డు సభ్యుల స్థానాలకు మహిళలు ప్రాతినిధ్యం వహించనున్నారు. తద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థలో మహిళలకు సముచిత గౌరవం దక్కనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.