News June 21, 2024
చెన్నైలోని ఐఐటీలో సీటు సాధించిన పేదింటి విద్యార్థిని

చివ్వెంల మండల కేంద్రానికి చెందిన విద్యార్థిని గుగులోత్ భాగ్య శ్రీ ఐఐటి చెన్నైలో సీటు సాధించింది. 2022లో భాగ్యశ్రీ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీటు సాధించింది. పేద కుటుంబంలో పుట్టి కష్ట పడి చదివి విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు భాగ్యశ్రీని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నత విద్యలు అభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.
Similar News
News November 20, 2025
NLG: వామ్మో కోతులు

జిల్లాలో కోతుల బెడద కారణంగా వ్యవసాయ, ఉద్యాన పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దిగుబడులు గణనీయంగా తగ్గడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. చాలాకాలంగా వానరాలతో అటు రైతులు, ఇటు ప్రజలు సతమతమవుతున్నారు. రోజూ వేలాది కోతులు కూరగాయలు, పండ్ల తోటలు, పొలాల్లోకి వచ్చి పంటలను నాశనం చేస్తూ రైతులను ఇబ్బందుల్లో పడేస్తున్నాయని తెలిపారు. అధికారులు స్పందించి కోతుల బెడద నివారణకు చర్యలు చేపట్టాలని రైతులు కోరారు.
News November 20, 2025
గ్రామాల్లో నేటి నుంచి చీరలు పంపిణీ

జిల్లాలో ఇందిరా మహిళా శక్తి పేరిట మహిళలు, యువతులకు నేటి నుంచి చీరలను పంపిణీ చేయనున్నారు. ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులకు కానుకగా చీరలు పంపిణీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. మొదటి విడతగా గ్రామాల్లో గురువారం నుంచి పంపిణీ చేపట్టనున్నారు. జిల్లాలో 3,66,532 మంది సభ్యులు ఉన్నారు. ఈ ప్రక్రియ డిసెంబర్ 9 వరకు కొనసాగనుంది.
News November 20, 2025
NLG: పైలట్ ప్రాజెక్టుగా 70 గ్రామాలు ఎంపిక!

నల్గొండ జిల్లాలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ప్రభుత్వం భూభారతిలో పక్కాగా హద్దులు తేల్చేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా సర్వే కోసం జిల్లాలో 70 గ్రామాలను ఎంపిక చేసింది. అందులో 8,627 సర్వేనెంబర్ల పరిధిలో 72,758.7 ఎకరాల భూమిని సర్వే చేసి లెక్కలు తేల్చనున్నారు. రెసిడెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం ద్వారా సర్వే జరిపి అనంతరం ఆ వివరాలను భూభారతి పోర్టల్లో అప్లోడ్ చేయనున్నారు.


