News August 12, 2024
చెన్నైలో ఘోర ప్రమాదం.. కర్నూలు బీటెక్ విద్యార్థి దుర్మరణం

కర్నూలుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి రామ్మోహన్(21) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. చెన్నైలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్న రామ్మోహన్.. తన స్నేహితులతో కలిసి కారులో అరుణాచలేశ్వర ఆలయానికి ఆదివారం బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న కారును తిరువళ్లూరు జిల్లాలో లారీ ఢీకొంది. ప్రమాదంలో రామ్మోహన్తో పాటు మరో నలుగురు స్నేహితులు అక్కడికక్కడే మృతిచెందారు.
Similar News
News November 1, 2025
స్పెషల్ ఆఫీసర్లు మండలాలకు వెళ్లాలి: కర్నూలు కలెక్టర్

కర్నూలు జిల్లాలో నియోజకవర్గ, మండల స్పెషల్ ఆఫీసర్లు ప్రతి వారం తప్పనిసరిగా మండలాలకు వెళ్లి ఆసుపత్రులు, పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్వాడీ సెంటర్లు, సచివాలయాలను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్లో ఆమె మాట్లాడుతూ.. బీసీ హాస్టళ్లలో పదో తరగతి ఉత్తీర్ణతా శాతం పెంచాలన్నారు. హాస్టళ్లలో తాగునీరు, భోజనం, టాయిలెట్లపై చర్యలు చేపట్టాలని సూచించారు.
News October 31, 2025
సీఎం చంద్రబాబుపై జగన్ వ్యాఖ్యలు సరికాదు: తిక్కారెడ్డి

‘మొంథా’ తుఫాను సమయంలో ప్రజలను కాపాడిన సీఎం చంద్రబాబు నాయకత్వాన్ని జగన్ తప్పుబట్టడం ఆశ్చర్యకరమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి శుక్రవారం విమర్శించారు. తుఫాన్ సమయంలో ప్రాణ నష్టం లేకుండా చూసిన చంద్రబాబుపై వ్యాఖ్యలు చేయడం జగన్కు తగదన్నారు. సీఎంగా ఉన్నప్పుడు తుఫాన్లు వచ్చినా గడప దాటని జగన్, ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన ఒక ప్రకటనలో మండిపడ్డారు.
News October 31, 2025
ఉద్యాన పంటల విస్తీర్ణం పెంచాలి: కలెక్టర్ సిరి

కర్నూలు జిల్లాలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి గురువారం అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో 91 శాఖల అధికారులతో మూడు రోజుల పాటు జరిగిన ఇంటరాక్టివ్ సెషన్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. స్టాండ్ అప్ ఇండియా పథకంపై అవగాహన పెంచాలని, నాబార్డ్ ద్వారా ఆర్ఐడీఎఫ్ నిధులు వినియోగించుకోవాలని సూచించారు.


