News January 27, 2025
చెన్నైలో విశాఖ డాక్టర్ అరెస్ట్

విశాఖలో కిడ్నీ ఆసుపత్రి నిర్వహిస్తున్న డా.రాజశేఖర్‌ను చెన్నైలో హైదరాబాద్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వారం రోజులుగా హైదరాబాద్, చెన్నై కేంద్రాలుగా నడుస్తున్న కిడ్నీ రాకెట్‌పై పోలీసులు దృష్టి సారించారు. ఈ రాకెట్లో విశాఖకు చెందిన డా.రాజశేఖర్ ఓ ముఠాను ఏర్పాటు చేసి కిడ్నీల మార్పిడికి పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అతనిని అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు.
Similar News
News December 3, 2025
BREAKING విశాఖ: స్పా సెంటర్‌పై దాడి.. ఐదుగురు అరెస్ట్

గాజువాక 80 ఫీట్ల రోడ్డులోని ఓ స్పా సెంటర్ పై సిటీ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఒక విటుడు, ఆర్గనైజరు, మేనేజర్, ఇద్దరు మహిళలను సిటీ టాస్క్‌ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని గాజువాక పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేశారు. అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడ జరిగినా సమాచారం ఇవ్వాలని టాస్క్‌ఫోర్స్ సీఐ అప్పలనాయుడు ప్రజలను కోరారు.
News December 3, 2025
అట్రాసిటీ కేసుల పరిష్కారంలో చొరవ చూపాలి: కలెక్టర్

SC, ST అట్రాసిటీ కేసుల పరిష్కారంలో అధికారులు, పోలీసులు ప్రత్యేక చొరవ చూపాలని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సాయం తీసుకొని త్వరగా ఫలితాలు వచ్చేలా చేయాలని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ సూచించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ మీటింగు హాలులో బుధవారం ఆయన సమీక్షించారు. అధికారులు ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవచూపాలన్నారు.