News September 2, 2024
చెన్నై నుంచి గూడూరు మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు

వాయుగుండం కారణంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గూడూరు జంక్షన్ మీదుగా వెళ్లే పలు రైళ్లు తాత్కాలికంగా రద్దు చేశారు. రద్దు చేసిన రైళ్లు క్రింది విధంగా :
12759 – చార్మినార్ (తాంబరం – హైదరాబాద్)
12615 – గ్రాండ్ ట్రంక్ (చెన్నై – న్యూ ఢిల్లీ)
12967 – జైపూర్ (చెన్నై – జైపూర్)
12621 – తమిళనాడు (చెన్నై-న్యూ ఢిల్లీ)
12760 – చార్మినార్ (హైదరాబాద్ – తాంబరం)
Similar News
News February 27, 2026
నెల్లూరు DPO కీలక ఆదేశాలు

నెల్లూరు జిల్లాలోని పంచాయతీల్లో 100% ఇంటి పన్నులను సెక్రటరీలు వసూలు చేయాలని DPO వసుమతి ఆదేశించారు. జిల్లాలో మార్చి నెలాఖరు నాటికి పన్నులు వసూలు చేయాలని చెప్పారు. పాదలకూరు, కోవూరు, వింజమూరు, రాపూరు పంచాయతీల్లో పన్నులు భారీగా పేరుకుపోయాయని తెలిపారు. వీటిని రాబట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ఆదేశించారు.
News February 27, 2026
నెల్లూరు: కిడ్నాప్.. తల లేకుండా డెడ్‌బాడీ లభ్యం

ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో యువకుడి మృతి కలకలం రేపింది. ముస్లిం వీధికి చెందిన ఉస్మాన్ ఓ హిజ్రాతో సన్నిహితంగా ఉండేవాడు. ఆమెకు చెందిన కొంత బంగారాన్ని అతని అన్న హుస్సేన్(33) తాకట్టు పెట్టి నగదు వాడుకున్నాడు. దీంతో ఆ హిజ్రా మరికొందరితో వచ్చి హుస్సేన్‌ను ఆటోలో తీసుకెళ్లి కిడ్నాప్ చేసింది. ఏమైందో ఏమో గురువారం పండ్లూరు వద్ద రైల్వే పట్టాలపై తల లేని మొండెంగా హుస్సేన్ డెడ్‌బాడీ దొరికింది.
News February 27, 2026
తిరుమలలో కొత్త విధానం..!

తిరుమలలో భక్తులు ముడుపులుగా సమర్పించే చిల్లర నాణేల స్థానంలో పత్రాలు వేసేలా టీటీడీ ప్రయత్నాలు ప్రారంభిస్తోంది. చాలామంది క్యూలైన్లలో కాయిన్స్ తీసుకెళ్లడం కష్టం అవుతోంది. ఇకపై పేమెంట్ యాప్ ద్వారా నగదు చెల్లిస్తే పత్రాన్ని ఇస్తారు. దీన్ని మీరు హుండీలో వేయవచ్చు. దీనిపై TTD బోర్డు త్వరలో నిర్ణయం తీసుకోనుంది. పత్రానికి సంబంధించి ఓ నమూనాను పై ఫొటోలో చూడవచ్చు.


