News September 28, 2024
చెరుకుపల్లిలో వ్యక్తి దారుణ హత్య
డిండి మండలం చెరుకుపల్లిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు కాళ్లు, చేతులు కట్టేసి బండరాయితో కొట్టి చంపారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ సురేశ్, ఎస్సై రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలిసినవారు డిండి పోలీస్ స్టేషన్ నంబర్ల(8712670223, 8712670155)కు సమాచారం అందించాలన్నారు.
Similar News
News October 4, 2024
NLG: ఇతర ప్రాంతాల ధాన్యం కొనుగోళ్లకు చెక్
ఈ వానాకాలం ధాన్యం కొనుగోలులో భాగంగా ఎట్టి పరిస్థితులలో బయటి ధాన్యాన్ని కొనుగోలు చేయకూడదని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి నల్గొండ జిల్లాకు ధాన్యం రావడానికి వీల్లేదని అన్నారు. 2024- 25 వానకాలం ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, తీసుకోవాల్సిన చర్యలపై గురువారం అయిన ఉదయాదిత్య భవన్‌లో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.
News October 4, 2024
ఉమ్మడి జిల్లాలో పలువురు ఎస్సైలు బదిలీ
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ఎస్సైలను బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు వాడపల్లి ఎస్సైగా పనిచేస్తున్న ఈడుగు రవి, హాలియా ఎస్సై సతీష్ రెడ్డిలను నల్లగొండ ఎస్పీ ఆఫీస్‌కు అటాచ్ చేశారు. అదే విధంగా సూర్యాపేట జిల్లాలోని పెన్ పహాడ్ ఎస్సై రవీందర్, ఆత్మకూరు(ఎస్) ఎస్సై వై.సైదులు, తుంగతుర్తి ఎస్సై ఏడుకొండలును ఎస్పీ ఆఫీసుకు అటాచ్ చేశారు.
News October 3, 2024
నల్గొండ: ఈనెల 14 వరకు డీజేల వినియోగంపై నిషేధం: ఎస్పీ
నల్గొండ జిల్లా పరిధిలో ఈనెల 14 వరకు కలెక్టర్ ఉత్తర్వుల మేరకు బహిరంగ ప్రదేశాల్లో ఉపయోగించే DJలతో సహా అధిక వాల్యూమ్ సౌండ్ ఎమిటింగ్ సిస్టమ్‌ల వినియోగంపై నిషేధం విధిస్తూన్నట్లు జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ తెలిపారు.బహిరంగ ప్రదేశాల్లో డీజేలు నుంచి ఉత్పన్నమయ్యే అధిక డెసిబెల్స్ కారణంగా మానవ ఆరోగ్యం, మానసిక ఆరోగ్యంపై ప్రభావాలు పడుతున్న కారణంగా నిషేధించినట్లు ఎస్పీ వెల్లడించారు.