News April 14, 2025
చెరుకుపల్లి : పరీక్షలో ఫెయిల్.. విద్యార్థి సూసైడ్

ఇంటర్ ఫస్టియర్ ఫెయిలైనందుకు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన చెరుకుపల్లిలోని పొన్నపల్లిలో ఆదివారం జరిగింది. ప్రశాంత్ రెడ్డి (18) ఫెయిల్ అవడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. కుటుంబీకులు గమనించి చెరుకుపల్లి ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Similar News
News December 9, 2025
ప్రకాశం: టెట్ పరీక్ష రాస్తున్నారా.. ఈ రూల్స్ పాటించండి.!

ప్రకాశం జిల్లాలో రేపటి నుంచి జరిగే టెట్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకై కలెక్టర్ రాజాబాబు పలు సూచనలు చేశారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం కలెక్టర్ మాట్లాడుతూ.. మొత్తం 810 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానుండగా, పరీక్ష హాలులోకి సెల్ఫోన్లకు అనుమతి లేదన్నారు. గంట ముందుగా పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు చేరాలని సూచించారు. ఉదయం 510 మంది, సాయంత్రం 300 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
News December 9, 2025
తిరుమలలో తులాభారం గురించి తెలుసా?

తిరుమల కొండపై శ్రీవారి మొక్కుబడులలో తలనీలాల తర్వాత అంతే ముఖ్యమైనది ‘తులాభారం’. ఇది భక్తులు తమ పిల్లల దీర్ఘాయుష్షు కోసం, తమ కోరికలు తీరినందుకు తీర్చుకునే మొక్కుగా భావిస్తారు. బిడ్డ బరువెంతుందో అంతే మొత్తంలో చిల్లర నాణాలు, బెల్లం, చక్కెర, కలకండ, బియ్యంతో తూకం వేసి, ఆ మొత్తాన్ని స్వామివారి హుండీకి సమర్పిస్తారు. ఈ మొక్కును ఆలయ మహద్వారం వద్ద రుసుము చెల్లించి తీర్చుకోవచ్చు. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News December 9, 2025
కృష్ణా: టిడ్కో ఇళ్లు రెడీ.. సంక్రాంతి కానుకగా పంపిణీ..!

ఉమ్మడి కృష్ణాలో టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని L&T సంస్థ చేపట్టింది. NTRలో జక్కంపూడి దగ్గర 6,776 ఇళ్లు నిర్మిస్తుండగా 1,104 సంక్రాంతికి ఇవ్వనున్నారు. మచిలీపట్నం రుద్రవరం వద్ద 2,300 నిర్మిస్తుండగా 1,008 ఇళ్లు జనవరిలో లబ్దిదారులకు ఇవ్వనున్నారు. ఇక జగ్గయ్యపేట 3,168, తిరువూరు 1,536, నందిగామ 240, ఉయ్యురు 2,496 టిడ్కో ఇళ్లు 75% పూర్తవుగా.. వచ్చే ఏడాది మే-జూన్ నాటికి అందజేస్తామని అధికారులు చెబుతున్నారు.


